హాలీవుడ్ హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్స్.. | hollywood highest paid actor is leonardo dicaprio | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్స్..

Published Sat, Mar 28 2015 3:26 PM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

హాలీవుడ్ హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్స్..

హాలీవుడ్ హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్స్..

టాలివుడ్లో హయ్యస్ట్ పేయిడ్ యాక్టర్ ఎవరో..  'మిస్టర్ పర్ఫెక్ట్' ఆమిర్ ఖాన్ ఒక్కో సినిమాకు ఎంత మొత్తం తీసుకుంటాడో అందరికీ తెల్సిందే! ఇక ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ఉన్న హాలీవుడ్ ఇండస్ట్రీలో హయ్యస్ట్ పేయిడ్ యాక్టర్ ఎవరనే విషయానికి వస్తేమాత్రం కళ్లను, చెవులను కొద్దిగా సర్దుకోవాల్సి వస్తుందేమో! అవును.. ప్రపంచ సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ది రివనెంట్ (2015, డిసెంబర్ విడుదల) హీరోగా నటించేందుకు ఓ నటుడు అక్షరాల రూ. 138.25  కోట్లు (25 మిలియన్ యూఎస్ డాలర్లు) వసూలు చేశాడు! ఇంతకీ ఆ హీరో ఎవరంటే..
 
ప్రేమకథలు, నిజ జీవితగాథల్లో నటించిన పాత్రకల్లా జీవంపోసే లియోనార్డో డికాప్రియో! ఇప్పటివరకు ఒక్క ఆస్కార్ అవార్డునూ సొంతం చేసుకోలేకపోయిన ఈ టైటానిక్ హీరో పారితోషికం విషయంలో మాత్రం ఇతర నటులందరినీ తోసిరాజన్నాడు. నటీనటుల పారితోషికం వివరాలను వెల్లడిస్తూ హాలీవుడ్ ప్రొడ్యూసర్స్, ఏజెంట్స, ఎగ్జిక్యూటివ్స్ సంయుక్తంగా రూపొందించిన జాబితాను ఇటీవలే విడుదల చేశారు.

అందులో 20 మిలియన్ డాలర్లు (రూ. 110.6 కోట్లు) పారితోషికాన్ని పొందుతున్నవారిలో రాబర్ట్ డౌనీ జూనియర్ (ఐరన్ మ్యాన్ ఫేమ్), మాట్ డామన్ (బార్న్ సుప్రిమసీ, ది డిపార్టెడ్ ఫేం) సరసన ఇటీవలే చేరిన నటీమణి.. సాండ్రా బుల్లక్! గతేడాది ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన 'గ్రావిటీ' మూవీలో లీడ్ రోల్ ప్లే చేసినందుకు ఆమెకు దక్కిన మొత్తం అక్షరాలా నూటాపది కోట్ల రూపాయలన్నమాట!  2014లో విడుదలైన 'మేల్ఫీసెంట్' సినిమాకు గాను సీనియర్ నటీమణి ఏజిలీనా జోలీ 15 మిలియన్ యూఎస్ డాలర్లు (దాదాపు రూ.82 కోట్లు) తీసుకుందట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement