ఎస్, ఎస్, ఎస్.. ఇట్స్ లియోనార్డో డికాప్రియో.. ఫైనల్లీ ద కింగ్ ఈజ్ బ్యాక్.. ఇది ట్విట్టర్ లో ఆయన అభిమానుల ప్రతిస్పందన.. ఐదుసార్లు బెస్ట్ నటుడిగా నామినేషన్ పొంది.. అందినట్టే ఊరించి చివరినిమిషంలో చేజారుతూ వస్తున్న ఆస్కార్ పురస్కారం ఎట్టకేలకు డికాప్రియోను వరించడంతో ఆయన అభిమానులే కాదు సహ నటులు సైతం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 'టైటానిక్'లో ఆయనకు జోడీగా నటించిన కేట్ విన్స్ లెట్ కూడా ఆనందబాష్పాలు రాలుస్తూ తన ఆనందాన్ని ప్రకటించింది.
ఇక ట్విట్టర్ లో అభిమానులు డికాప్రియో తొలి ఆస్కార్ అందుకున్నందుకు ఫిబ్రవరి 28న అధికారికంగా ప్రపంచవ్యాప్త సెలవును ప్రకటించాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా డికాప్రియో ప్రతిభను గుర్తించారని ఆనందం వ్యక్తం చేశారు.
ఇటు బాలీవుడ్ ప్రముఖులు అనీల్ కపూర్, అనుపమ్ ఖేర్, ఫర్హాన్ అఖ్తర్ తదితరులు ట్విట్టర్ లో లియోనార్డో డికాప్రియోకు అభినందనలు తెలిపారు. ఇప్పటికైనా ఆయన ప్రతిభకు తగిన గుర్తింపు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. బ్రయన్ క్రాంస్టన్ (ట్రంబో), మైఖేల్ ఫాస్ బెండర్ (స్టీవ్ జాబ్స్), ఎడ్డీ రెడ్మైనీ (ద డానిష్ గర్ల్), మాట్ డామన్ (ద మార్షియన్) వంటి హీరోలు రేసులో ఉన్నా 'ద రెవెనంట్' సినిమాలో చూపిన అద్భుతమైన అభినయానికిగానూ డికాప్రియో ఆస్కార్ సాధించారు. ఆయనకు గతంలో 'ద వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్', 'బ్లడ్ డైమండ్' వంటి సినిమాలకు ఆస్కార్ నామినేషన్ లభించింది.
ఫైనల్లీ ద కింగ్ ఈజ్ బ్యాక్!
Published Mon, Feb 29 2016 2:40 PM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM
Advertisement
Advertisement