తమిళనాట గతంలో ఎన్నడూ లేనంతగా నీటి సమస్య ఏర్పడింది. ప్రధాన రిజర్వాయర్లన్నీ అడుగంటడంతో చెన్నై నగరంలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఇప్పటికే స్పందించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తున్న వర్షాలు భారీగా కురిస్తే తప్ప సమస్య పరిష్కారమయ్యా దారి కనిపించటం లేదు.
తాజాగా ఈ విషయంపై హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో బావి దగ్గర నీటి కోసం చూస్తున్న మహిళల ఫోటోను పోస్ట్ చేసిన డికాప్రియో చెన్నై సమస్యపై సుధీర్ఘ కామెంట్ చేశారు. ఈ సమయంలో చెన్నైని వర్షం మాత్రమే కాపాడగలదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు చెన్నైలో సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తన పోస్ట్‌లో ప్రస్తావించారు డికాప్రియో.
‘చెన్నైలో అత్యవరస పరిస్థితి ఏర్పడటంతో అంతా పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా అందించే నీటి కోసం గంటల తరబడి క్యూ లైన్‌లలో నిలబడాల్సి వస్తోంది. నీరు అందక హోటళ్లు, రెస్టారెంట్‌లు మూసేస్తున్నారు. మెట్రోలో ఏసీల వినియోగం ఆపేశారు’ అంటూ కామెంట్ చేశారు లియోనార్డో డికాప్రియో.
Comments
Please login to add a commentAdd a comment