ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో, బ్రాడ్ కాస్టర్ డేవిడ్ అటన్ బరో, బిజినెస్ దిగ్గజం రిచర్డ్ బ్రాన్ సన్ లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) తరఫున ప్రచారం చేయనున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. సంఘ్ పరివార్ కు చెందిన కొందరు వ్యక్తులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 30, 31 తేదీలలో యూకే పర్యటనకు వెళ్లనున్న ఆర్ ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ను హాలీవుడ్ ప్రముఖులు కలవనున్నట్లు తెలిపారు. బీఫ్ వినియోగం, శాఖాహారంపై ఆర్ ఎస్ఎస్ తరఫున వీరందరూ ప్రచారం చేయనున్నట్లు వివరించారు. ఆ తర్వాత కాంటర్బ్యూరీలోని ఆర్చీ బిషప్ ను కలుస్తారని చెప్పారు. హిందూ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా శివీర్ గ్రాండ్ క్యాంప్ కోసం యూకే వెళ్తున్న ఆయన మిగిలిన కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.
కాగా, జంతు వధలపై డికాప్రియో ఎప్పటినుంచో ప్రచారం చేస్తుండగా, వేగన్ అయిన బ్రాన్ సన్ తాను సొంతగా వేగన్ ఎయిర్ లైన్ ను ప్రారంభించబోతున్నట్లు 2015లో ప్రకటించారు.సంఘ్ పరివార్ కు అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, తూర్పు ఆసియా దేశాల్లో ప్రచారకులు ఉన్నారు.
ఆర్ఎస్ఎస్ తరఫున లియోనార్డో డికాప్రియో ప్రచారం?
Published Thu, Jun 23 2016 6:08 PM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM
Advertisement
Advertisement