న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం తారస్థాయికి చేరుతోంది. దీంతో ఢిల్లీ వాయు కాలుష్యం వల్ల భవిష్యత్తులో తలెత్తే సమస్యలపై.. అక్కడి ప్రజలకు అవగాహన కల్పించడానికి కొంతమంది గ్రూపులుగా చేరి నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్నారు. ఈ క్రమంలో హాలీవుడ్ నటుడు, పర్యావరణ ప్రేమికుడు లియోనార్డో డికాప్రియో సోషల్ మీడియా వేదిక ఢిల్లీ నిరసనకారులకు మద్దతు తెలిపాడు. ‘న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద సుమారు 1500 వందల మంది సమూహాంగా చేరి నగరంలో ప్రమాదకరంగా మారుతోన్న వాయు కాలుష్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ నివేదిక ప్రకారం వాయు కాలుష్యం వల్ల భారతదేశంలో ప్రతి ఏటా సుమారు 10.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ఇది ప్రపంచ వాయు కాలుష్యా మరణాల గణాంకాలలో 5వ స్థానంలో ఉంది’ అని ఈ ఆస్కార్ అవార్డు గ్రహీత తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. అదే విధంగా ఈ నిరసనకు.. కొద్ది గంటలోపే ప్రభుత్వం స్పందించిందని తెలిపారు. ఈ క్రమంలో... కాలుష్య నివారణకై భారత ప్రధాని కార్యాలయం ఓ ప్రత్యేక కమిటీని నియమించిందని, ఈ కమిటి సమస్యపై సుదీర్ఘ విచారణ చేపట్టి రెండు వారాల్లోగా నివేదిక కూడా ఇవ్వనుందని లియోనార్డో తన పోస్టులో పేర్కొన్నారు.
అలాగే లియోనార్డో డికాప్రియో క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రూప్, ఎక్స్‌టింక్షన్ రెబెలియన్‌లు వంటి సామాజిక సంస్థల గురించి ఇన్‌స్టా పోస్టులో ప్రస్తావిస్తూ.. ‘ ఈ కార్యకర్తలు వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, అలాగే కాలుష్యం తీవ్రత స్థాయి తగ్గి.. సాధారణ స్థాయికి వచ్చే వరకు ఈ సంస్థ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోస్తుంది’ అని రాసుకోచ్చిన ఈ పోస్టుకు ‘నాకు మంచి భవిష్యత్తు కావాలి’ అంటూ ప్లకార్డును పట్టుకుని నిరసన తెలుపుతున్న ఓ చిన్నారి ఫోటోను జత చేశారు. అదే విధంగా న్యూఢిల్లీలోని కాలుష్యం గురించి ప్రస్తావించారు. కాగా చెన్నై నీటి సంక్షోభం గురించి కూడా అతడు ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక పర్యావరణ ప్రేమికుడైన ఈ హలీవుడ్ నటుడు వాతావరణ సమస్యలపై అవగాహన కల్పించేందుకు 1998లోనే తన పేరు మీద ఓ సంస్థను స్థాపించాడు. ఆహార కాలుష్యంపై 2016లో వచ్చిన ఓ డాక్యూమెంటరీ నిమిత్తం 2015లో భారత్‌కు కూడా వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment