మల్లికా శెరావత్‌కు వింత అనుభవం | Mallika Sherawat Says Producer Wanted to Fry Egg on Her Belly | Sakshi
Sakshi News home page

మల్లికా శెరావత్‌కు వింత అనుభవం

Published Tue, Jul 2 2019 9:00 PM | Last Updated on Tue, Jul 2 2019 9:09 PM

Mallika Sherawat Says Producer Wanted to Fry Egg on Her Belly - Sakshi

ముంబై: తన ఉదరం(బెల్లీ)పై కోడిగుడ్డు ఫ్రై చేసేందుకు ఓ నిర్మాత ఉబలాటపడ్డాడని బాలీవుడ్‌ కథానాయిక మల్లికా శెరావత్‌ వెల్లడించారు. సినిమా పరిశ్రమలో తనకు ఎదురైన వింత అనుభవాలను కపిల్‌ శర్మ కామెడీ షోలో పంచుకున్నారు. ‘ఓ సినిమా కోసం పాట చిత్రీకరిస్తుండగా కొత్తగా ఏదైనా చేయాలని నిర్మాత భావించాడు. నన్ను చాలా హాట్‌గా చూపించాలని ఉబలాటపడ్డాడు. ఈ పాటలో నీ ఉదరంపై కోడిగుడ్డు ప్రై చేసినట్టు చూపిస్తానంటూ కొరియోగ్రాఫర్‌ ద్వారా అడిగించాడు. ఇది అక్షరాల నిజం. వాస్తవానికి నిర్మాతే నన్ను అడగాలనుకున్నాడ’ని మల్లికా శెరావత్‌ వెల్లడించారు. దీనికి మీరు ఒప్పుకున్నారా అని సహ వ్యాఖ్యాత అర్చనా పూరన్‌ సింగ్‌ అడగ్గా.. ఒప్పుకోలేదని మల్లిక జవాబిచ్చారు.

తనకు ఎదురైన మరో వింత అనుభవం గురించి ఇటీవల మరో సందర్భంలో మల్లిక చెప్పారు. కొత్తదనం పేరుతో ఓ పాటలో తన నడుముపై వేడివేడి రోటీలు చేస్తున్నట్టు చూపిస్తానని ఒక దర్శకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడట. చాలా మంది నటులు తమ ప్రియురాళ్లకు అవకాశం ఇచ్చి తనను పక్కన పెట్టడంతో 30 సినిమాల వరకు పోగొట్టుకున్నానని మల్లిక వాపోయారు.  వాళ్లను ఇప్పుడు తలచుకుంటే బుద్ధిహీనుల్లా కనిపిస్తారని వ్యాఖ్యానించారు.

శృంగార తారగా తన మీద ముద్ర పడటంతో తమతో సన్నిహితంగా గడపాలని చాలా మంది నటులు అడిగారని తెలిపారు. తెరపై అలాంటి దృశ్యాల్లో కనిపించినప్పడు ఏకాంతంగా తమతో గడపటానికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించేవారని చెప్పారు. ఇలా చేయడం ఇష్టం లేక ఎన్నో సినిమాలు వదులుకున్నానని, మన దేశంలో నాలాంటి మహిళలను సమాజం ఏవిధంగా చూస్తుందనే దానికి ఈ ఘటనలు అద్దం పడతాయని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement