మల్లిక... కారు దిగలేక!
బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ మరోసారి వార్తల్లో నిలిచింది. 37 ఏళ్ల ఈ అందాలభామ సొంతూరు ప్రయాణంతో పతాక శీర్షికలకెక్కింది. 'బ్యాచరెట్ ఇండియా-మేరీ ఖయలోన్ కీ మల్లిక' కార్యక్రమం షూటింగ్ కోసం హర్యానాలోని తన సొంతూరికి వెళ్లిన మల్లికకు అభిమానులు ఊహించని విధంగా స్వాగతం పలికారు. హీరోయిన్ అయిన తర్వాత తొలిసారిగా ఇక్కడికి వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు పోటెత్తారు.
తమ అభిమాన తారను కలుసుకోవాలన్న ఉత్సాహంతో మల్లిక కారు చుట్టుముట్టారు. దారంటా ఆమె కారు వెనుక పరిగెత్తారు. మల్లిక మానియాతో ఆమె స్వగ్రామం ఊగిపోయింది. దీంతో మల్లిక కారులోంచి అడుగు పెట్టలేకపోయింది. చేసేది లేక కారులోనే నిస్సహాయంగా కూర్చుండిపోయింది. సొంతూరి పర్యటనలో తనకెదురైన అనుభవంపై మల్లిక ట్విటర్ లో స్పందించింది. కారు నుంచి కాలు బయటపెట్టలేకపోయానని పోస్ట్ చేసింది.
My first visit to my hometown in Haryana, couldn't even get out of the car!! http://t.co/hXC3FfTzfM
— Mallika Sherawat (@MallikaLA) June 19, 2014