నన్ను ఒంటరిగా వదిలేయండి:మల్లికా షెరావత్
ముంబై: బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ తరచు వార్తల్లో నిలవడం కొత్తేమీ కాదు. వివాదాలను వెంటబెట్టుకునే తిరిగే 37 ఏళ్ల ఈ అందాలభామ ప్రస్తుతం తెగ మదనపడుతోంది. దానికి కారణం మాత్రం హాలీవుడ్ నటుడు ఆంటోని బాండరస్. అతనితో మల్లిక ఎఫైర్లు నడుపుతున్నట్లు వార్తలు ఊపందుకోవడంతో ఆమె కలత చెందుతోంది.'నన్ను ఒంటరిగా వదిలేయండి. దయచేసి విసిగించకండి. తన వ్యక్తిగత జీవితంలో అంశాలను భూతద్దంలో చూపించకండి' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. హాలీవుడ్ నటుడు ఆంటోనీ బాండాస్ భార్య మెలనీ గ్రిఫిత్ తో దూరం అయ్యాక.. మల్లికకు దగ్గరయ్యాడనే రూమర్లు ఈ మధ్య మరీ ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి.
వీటిని ఖండించిన మల్లిక.. రెండు సంవత్సరాల క్రితం అతనితో ఓ కార్యక్రమంలో డ్యాన్స్ చేసిన వీడియోలను ఇప్పుడు విడుదల చేసి నానా రాద్దాంతం చేస్తున్నారని మండిపడింది. అప్పుడెప్పుడో జరిగిన విషయాన్ని పెద్దదిగా చేయొద్దని విన్నవించింది. ఇదిలా ఉండగా, అతను గొప్ప డ్యాన్సరే కాకుండా అద్భుతమైన వ్యక్తిత్వం కలవాడని మల్లిక కితాబిచ్చింది.