దర్శకుడు టవల్ తీసేయమన్నాడు : నటి
లాస్ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి సల్మా హాయాక్ ‘డస్పెరాడో’ మూవీలో హీరోతో ఓ శృంగార సన్నివేశం చిత్రీకరణ సమయంలో ఇబ్బందికి గురయ్యానని పేర్కొన్నారు. ఈ మూవీ ఆమె ప్రముఖ నటుడు ఆంటోనియో బాండెరాస్కు జోడీగా నటించారు. ఇటీవల ఓ టీవీ షోకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆమె ఈ సందర్భంగా ‘డెస్పెరాడో’ మూవీ జ్ఞాపకాలను పంచుకున్నారు. 1995లో దర్శకుడు రాబర్ట్ రోడ్రీగ్యూజ్ రూపొందించిన ఈ మూవీలో ఆంటోనియో, సల్మాలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సందర్భంగా సల్మా మాట్లాడుతూ.. ఈ మూవీలో హీరోకు తనకు మధ్య ఉండే గ్రాఫికల్ సెక్స్ సీన్ చిత్రీకరణ సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డానని, దర్శకుడు నా టవల్ తీసేయమని చెప్పినప్పుడల్లా ఏడ్చానన్నారు. ‘దర్శకుడు రాబర్ట్ ఈ మూవీ కథ వివరించినప్పుడు హీరోకు నాకు మధ్య ఉండే ఈ శృంగార సన్నివేశం గురించి ప్రస్తావించలేదు. మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యాక రొమాంటిక్ సీన్ కోసం సెట్స్ సిద్ధం చేస్తున్నారు.
ఇది చూసి నేను షాకయ్యాను. వెంటనే దర్శకుడిని అడగ్గా ఆయన మీకు, హీరోకు మధ్య కాస్తా రొమాంటిక్ సీన్ ఉంటుంది. ఇందులో భాగాంగా మీరు ఈ శృంగార సన్నివేశంలో నటించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఈ సన్నివేశం చిత్రీంచే సమయంలో అక్కడ కేవలం హీరో, దర్శకుడు, మూవీ నిర్మాత, రాబర్ట్ భార్య ఎలీజబెత్ అవెల్లాన్లు మాత్రమే ఉండాలని డిమాండ్ చేశాను. దీనికి వారు కూడా అంగీకరించారు. ఇక ఈ సీన్ షూట్ చేసే సమయంలో ఇక నేను ఏడవడం మొదలు పెట్టాను. ఎందుకంటే హీరో ఆంటోనియో నాకంటే చాలా పెద్దవాడు. మంచి వ్యక్తి, షూటింగ్లో ఆయన నేను మంచి స్నేహితులం కూడా అయ్యాం. కానీ ఈ సీన్లో నటించేందుకు ఆయన ఏమాత్రం భయపడటం లేదు. అసలు ఏం జరగనట్లుగా వ్యవహరించారు. అలా అయనను చూసి నాకు చాలా భయమేసింది. దీంతో ఒక్కసారిగా ఏడవడం ప్రారంబంభించాను. ఈ నన్ను సముదాయించడానికి వారు కాస్తా బ్రేక్ ఇచ్చి తిరిగి షూట్ చేసేవారు. అయితే అప్పుడు నేను టవల్‌పై ఉన్నాను.
దీంతో సీన్లో నా టవల్ తీసేయాలని చెప్పినప్పడు మళ్లీ ఏడవడం మొదలు పెట్టాను. దీంతో నన్ను నవ్వించేందుకు దర్శకుడు రాబర్ట్, హీరో ఆంటోనియో కాస్తా బ్రేక్ ఇచ్చేవారు. తర్వాత కూడా ఈ సీన్లో మళ్లీ మళ్లీ ఏడ్చేను. అలా ఈ ఒక్క సీన్‌కే చాలా టేక్‌లు తీసుకున్నాను. అయిన హీరో కానీ, డైరెక్టర్ కానీ నా మీద ఒత్తిడి తేలేదు. ఆ సమయంలో వారు చాలా సహనంతో వ్యవహిరించారు. ఇది నిజంగా అద్బుతమైన విషయం కదా’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఆమె నటించిన ‘ది వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మెక్సికో’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ‘ది ఎటర్నల్స్’తో పాటు ‘ది హిట్మన్స్ వైఫ్ బాడిగార్డు’లో నటిస్తున్నారు. ‘ఎటర్నల్స్’ మూవీ గతేడాది నవంబర్ విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. దర్శకుడు చోలే జావో దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆమెతో పాటు ప్రముఖ నటి ఏంజెలినా జోలీ, రిచర్డ్ మాడెన్, కిట్ హోరింర్టన్, గెమ్మచాన్ తదితరులు కూడా నటించారు.
(చదవండి: లక్ష్మీ దేవిని ఆరాధిస్తాను: హాలీవుడ్ నటి)
(ముక్కలు.. ముక్కలైన నవ్వుతున్నాడు..!)
(తండ్రి వర్థంతి: హీరో వెంకటేష్ భావోద్వేగం)