నరేంద్రమోడీ అందగాడు... మల్లికా షెరావత్ పాట!
భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అభిమానుల జాబితాలో బాలీవుడ్ శృంగార తార మల్లికా షెరావత్ చేరింది. నరేంద్ర మోడీ 63వ జన్మదినం రోజున శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో సందేశాన్ని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పోస్ట్ చేసింది. అంతేకాక యూట్యూబ్ లో కూడా అభిమానులకు అందుబాటులో ఉంచింది. మోడీ 'మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్' వ్యాఖ్యలు చేయడం విశేషం. పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతోంది అని మల్లికా చేసిన చర్యలను కొందరు బాహాటంగానే విమర్శించారు.
మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అందర్ని దృష్టిని ఆకర్షించడానికి చేసిన పబ్లిసిటీ అని తెలిపింది. 'ది బాచెలరెట్ ఇండియా - మేరే ఖయాలోంకి మల్లికా' అనే కార్యక్రమ ప్రచారం కోసం ఉదయపూర్ చేరుకున్న మల్లికా మీడియాతో మాట్లాడుతూ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అని వ్యాఖ్యలు చేసింది. నరేంద్రమోడీ అందగాడు. అధునిక భావాలున్న వ్యక్తి.. కొన్నిసార్లు తప్పుగా అర్ధం చేసుకున్నాడు' అని మల్లికా షెరావత్ తెలిపింది.