
రజనీతో డేటింగ్ చేయాలనుంది
సూపర్‌స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టైల్ కింగ్ రజనీ అంటే మోజుపడని వారు ఉండరు. ఆయన సరసన ఒక్క చిత్రంలో అయినా నటించాలని ఆశపడని హీరోయిన్లు ఉండరు. రజనీకాంత్‌తో ఏకంగా డేటింగ్ చేయాలని కోరికను సంచలన నటి మల్లికా షెరావత్ వ్యక్తం చేయడం విశేషం. అది ఏకాంత దీవిలో రజనీతో డేటింగ్ చేయాలని ఆమె ఆశపడుతోందట.
కోలీవుడ్‌లో దశావతారం చిత్రంలో నటించిన మల్లికాషెరావత్ ఆ మధ్య శింబు చిత్రం ఒస్తిలో ప్రత్యేక పాటలో కవ్వించింది కూడా. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న రియాలిటీ షోలో తన ప్రేమికుడిని ఎంపిక చేసుకునే ప్రయత్నంలో పడ్డ మల్లిక మనసును ఆకట్టుకున్న వ్యక్తిని ఎంచుకుంటానంటోంది.
ఈ షోలో ఇప్పటి వరకు 15 మంది యువకులు ఈ బ్యూటీకి ప్రేమ వల వేశారట. వారి ప్రేమైక వచనాలకు సంతోషించిన మల్లిక బదులుగా ముద్దులు ఇచ్చుకుందట. ఈ సందర్భంగా ఎవరితో డేటింగ్ చేయాలని కోరుకుంటున్నారన్న ఒక విలేకరి ప్రశ్నకు మల్లికా షెరావత్ రజనీకాంత్‌తో ఏకాంత దీవిలో డేటింగ్ చేయాలనుందని బదులిచ్చిందట.