
'మంచి ప్లాట్ ఫామ్ దొరికితే రాజకీయాల్లోకి'
ముంబై: మంచి ప్లాట్ ఫామ్ దొరికితే రాజకీయాల్లోకి వస్తానని బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ పేర్కొంది. రాజకీయాల్లోకి వస్తే మహిళా సాధికారతపై ప్రధానంగా దృష్టిపెడతానని వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు తననెంతో ఆకట్టుకుందని తెలిపింది.
'నాకు మంచి ప్లాట్ ఫామ్ దొరికితే రాజకీయాల్లోకి వస్తా. మహిళలకు మేలు చేయడం ద్వారా సమాజానికి నా వంతు సేవ చేస్తా. నరేంద్ర మోదీ పనితీరు నన్నెంతో ఆకట్టుకుంది. జాతి యావత్తు ఆయన పనితీరును మెచ్చుకుంటోంది' అని మల్లికా షెరావత్ పేర్కొంది.
ఆమె నటించిన తాజా చిత్రం 'డర్టీ పాలిటిక్స్' త్వరలో విడుదలకానుంది. కేసీ బొకాడియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఓంపురి, అనుపమ్ ఖేర్, నసిరుద్దీన్ షా, జాకీష్రాఫ్ ముఖ్యపాత్రల్లో నటించారు.