ఆయనతో భలే ఇబ్బంది: మల్లికా శెరావత్ | felt uncomfortable with om puri, says mallika sherawat | Sakshi
Sakshi News home page

ఆయనతో భలే ఇబ్బంది: మల్లికా శెరావత్

Published Tue, Dec 23 2014 1:27 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఆయనతో భలే ఇబ్బంది: మల్లికా శెరావత్ - Sakshi

ఆయనతో భలే ఇబ్బంది: మల్లికా శెరావత్

శృంగార సన్నివేశాలంటే ఏమాత్రం మొహమాటం, ఇబ్బంది లేకుండా నటించే వాళ్లలో మల్లికా శెరావత్ కొంత ముందంజలో ఉంటారు. అయితే.. ఆమె సైతం ఓ నటుడితో అలాంటి సన్నివేశాలు చేయడానికి ఇబ్బంది పడ్డారంటే నమ్మగలరా? అవును.. 'డర్టీ పాలిటిక్స్‌'లో సీనియర్ నటుడు ఓంపురితో 'ఆ' సన్నివేశాలు చేయడానికి ఇబ్బంది పడ్డానని స్వయంగా మల్లికా శెరావత్ తెలిపింది. ఆయనతో అలాంటి సీన్లు చేయడానికి తాను చాలా ఇబ్బంది పడ్డానని, అయితే ఆయన తనను సౌకర్యంగా ఉండేలా చేశారని ఈ సెక్స్ బాంబ్ చెప్పింది.

కె.సి. బొకాడియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మూలకథ భన్వారీదేవి సెక్స్‌ స్కాండల్ అని అంటున్నారు. ఇందులో ఓంపురి ఓ నాయకుడి పాత్రను చేస్తున్నారు. ఆయనను ఉపయోగించుకుని జీవితంలో ఎదగడానికి ప్రయత్నించే అనోఖిదేవి అనే పాత్రలో మల్లికా శెరావత్ నటించింది. ఈ సినిమాలో ఇంకా నసీరుద్దీన్‌షా, అనుపమ్‌ఖేర్‌, జాకీ ష్రాఫ్‌, అశుతోష్‌ రాణా, రాజ్‌పాల్‌ యాదవ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement