జాట్‌లకు ట్విట్టర్‌లో మల్లిక సూచన | Mallika Sherawat urges Jats for peace and non violence | Sakshi
Sakshi News home page

జాట్‌లకు ట్విట్టర్‌లో మల్లిక సూచన

Published Tue, Feb 23 2016 5:03 PM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM

జాట్‌లకు ట్విట్టర్‌లో మల్లిక సూచన

జాట్‌లకు ట్విట్టర్‌లో మల్లిక సూచన

ముంబై: రిజర్వేషన్ల కోసం ఆందోళనలు చేస్తున్న జాట్లకు బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ ట్విట్టర్‌లో ఒక సూచన చేసింది. శాంతియుతంగా, అహింసాయుతంగా ముందుకుసాగాలని ఆమె జట్లకు విజ్ఞప్తి చేసింది. తమను ఓబీసీల్లో చేర్చి ప్రభుత్వ విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా జాట్లు హింసాత్మక ఆందోళనలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.

'మర్డర్' సినిమాతో సంచలనం సృష్టించిన మల్లికా షెరావత్‌ది హరియాణా హిస్సార్‌ లోని ఓ మారుమూల కుగ్రామం. బాలీవుడ్ హీరోయిన్ అయిన మల్లిక చివరిసారిగా 'డర్టీ పాలిటిక్స్' సినిమాలో కనిపించింది. జాట్ల ఆందోళనలతో హరియాణ అట్టుడుకుతున్న నేపథ్యంలో బాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీలు వారికి విన్నపాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు రణదీప్ హూడా, క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా శాంతియుతంగా ముందుకుసాగాలని జాట్లకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement