ద్రౌపదిగా చేయాలని.. మల్లిక తహతహ! | Mallika Sherawat keen to play Draupadi on big screen | Sakshi

ద్రౌపదిగా చేయాలని.. మల్లిక తహతహ!

Aug 3 2015 5:49 PM | Updated on Sep 3 2017 6:43 AM

ద్రౌపదిగా చేయాలని.. మల్లిక తహతహ!

ద్రౌపదిగా చేయాలని.. మల్లిక తహతహ!

ఇటీవలి కాలంలో బాలీవుడ్ హీరోయిన్లంతా పౌరాణిక పాత్రలు, వాటిని పోలి ఉండే సామాజిక పాత్రలు పోషించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇటీవలి కాలంలో బాలీవుడ్ హీరోయిన్లంతా పౌరాణిక పాత్రలు, వాటిని పోలి ఉండే సామాజిక పాత్రలు పోషించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే అహల్య తరహా పాత్రను ఓ షార్ట్ ఫిలింలో పోషించింది. దానికి యూట్యూబ్లో దాదాపు 45 లక్షలకు పైగా హిట్లు వచ్చాయి. ఇప్పుడు తాను ద్రౌపది పాత్ర పోషిస్తానంటూ.. బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ ముందుకొచ్చింది.

ద్రౌపది చాలా శక్తిమంతమైన మహిళ అని.. అందుకే ఆ పాత్ర చేయాలని తనకు ఉందని మల్లిక ఓ కార్యక్రమంలో చెప్పింది. చివరిసారిగా ఆమె కేసీ బొకాడియా తీసిన 'డర్టీ పాలిటిక్స్' సినిమాలో నటించింది. తనకు చాలా ఆఫర్లు వస్తున్నాయి గానీ, సరైన స్క్రిప్టు, సరైన సినిమాను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు చెప్పింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement