draupadi role
-
ద్రౌపది, సీత పాత్రల్లో అలరించనున్న దీపికా పదుకోన్!
అనుకున్నట్లు అన్నీ కుదిరితే దీపికా పదుకోన్ని ప్రేక్షకులు సీత, ద్రౌపది పాత్రల్లో చూసే అవకాశం ఉంది. ఇప్పటికి ద్రౌపది పాత్ర ఖరారైంది. సీత పాత్ర ఖరారు కావాల్సి ఉంది. ఒకవేళ ఈ రెండు పాత్రలూ దీపికా చేస్తే.. రెండు పౌరాణిక పాత్రల్లో నటించిన ఘనత దీపికాకే దక్కుతుంది. ఇక విషయంలోకి వస్తే.. దీపికా పదుకోన్ కథానాయికగా రెండేళ్ల క్రితం ‘మహాభారత’ సినిమా ప్రకటన వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. రెండేళ్లయినా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడంతో ‘మహాభారత’ ఆగిందనే వార్తలు ప్రచారంలోకొచ్చాయి. ఈ వార్తలకు చిత్రనిర్మాత మధు మంతెన ఫుల్స్టాప్ పెట్టారు. ‘‘దీపికాకు ఈ కథ నచ్చి, నటించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా కూడా ఉండాలనుకున్నారు. ద్రౌపది దృష్టి కోణం నుంచి మహాభారతాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. పురాణాలు చెబుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకే చాలా పరిశోధనలు చేసి, సమాచారం సేకరించాం. ఇప్పుడు స్క్రీన్ప్లేకి కావాల్సిన సమాచారం మా దగ్గర ఉంది. అయితే ఈ సినిమాకి టైమ్ పడుతుంది. ఈలోపు ‘రామాయణ’ మొదలుపెడతాం. అయితే ఇంకా నటీనటులను అనుకోలేదు. రానున్న దీపావళికి ‘రామాయణ’ నటీనటులను ప్రకటించాలనుకుంటున్నాం’’ అన్నారు. అయితే ‘రామాయణ’లో సీత పాత్రను దీపికా చేయనున్నారనే వార్త ఉంది. అలాగే స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ‘సీత: ది ఇన్కార్నేషన్’ కథ రాస్తున్నారు. ఈ సినిమాలో సీతగా దీపికా నటిస్తారనే టాక్ కూడా ఉంది. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కదాంట్లో అయినా సీతగా ఆమె నటిస్తే.. అటు ద్రౌపదిగానూ ఇటు సీతగానూ నటించిన ఘనత దీపికాకు దక్కుతుంది. -
ద్రౌపదిగా కనిపించనున్న రియా చక్రవర్తి!
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి తన సినిమాలపై దృష్టి సారించింది. అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీలతో కలిసి నటించిన 'చెహ్రే' సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉండగా తాజాగా ఆమెకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు బీటౌన్లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. మహాభారతాన్ని ప్రేరణగా తీసుకుని తెరకెక్కుతున్న సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రియాను సంప్రదించారట. ఇందులో ఆమె ఆధునిక ద్రౌపదిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ సినిమా ఇంకా ప్రారంభ దశలోనే ఉందట. మరి ద్రౌపది పాత్ర చేయడానికి రియా అంగీకరించిందా? లేదా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. కాగా 'తూనీగ తూనీగ' అనే తెలుగు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన రియా.. బ్యాంక్ చోర్, హాఫ్ గర్ల్ఫ్రెండ్, మేరే డాడ్ కీ మారుతి వంటి హిందీ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ కోణంలో గతేడాది రియా అరెస్టైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ నటి ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటపడుతోంది. గత కొద్ది రోజులుగా మళ్లీ ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో టచ్లో ఉంటోంది. ఇటీవల టైమ్స్ విడుదల చేసిన '50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020' జాబితాలోనూ రియా చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. చదవండి: 'బాలీవుడ్లో ఛాన్సులు లేక టాలీవుడ్ వైపు చూస్తున్న రియా' -
ద్రౌపదిగా వినిపిస్తా!
మహాభారతంలో ద్రౌపది పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ పాత్రలో వినిపించడానికి రెడీ అవుతున్నారు బాలీవుడ్ కథానాయిక శిల్పాశెట్టి. వావ్.. మరి ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? పాండవులుగా నటించేదెవరు? కౌరవుల మెయిన్ టీమ్ కౌన్? ఇలాంటి ప్రశ్నలు మీ మైండ్లోకి వస్తే వెంటనే ఫుల్స్టాప్ పెట్టండి. ఎందుకంటే.. ఇది సినిమానో, టీవీ సీరియలో, వెబ్ సిరీసో కాదు. రేడియోలో ‘మహాభారతం’ వినబోతున్నాం. ఇందులో ద్రౌపది పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు శిల్పా శెట్టి. ‘‘నాలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. చిన్నప్పుడు బీఆర్ చోప్రా మహాభారతం మాత్రమే టీవీలో చూసే చాన్స్ ఉండేది. అందులో ద్రౌపది పాత్ర చాలా బాగుంటుంది. ఈ పాత్రకు వాయిస్ అందిచ బోతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు శిల్పా. వెండితెరపై హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారామె. అలాగే బుల్లితెరపై కూడా సత్తా చాటారు శిల్పా. ఇప్పుడు రేడియో ప్లాట్ఫామ్లోకి ద్రౌపది పాత్రతో ఫస్ట్ టైమ్ ఎంట్రీ ఇస్తున్నారు. పదేళ్ల క్రితం వచ్చిన ‘ఆప్నే’ సినిమా తర్వాత శిల్పాశెట్టి మరో ఫుల్ లెంగ్త్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. -
ద్రౌపదిగా చేయాలని.. మల్లిక తహతహ!
ఇటీవలి కాలంలో బాలీవుడ్ హీరోయిన్లంతా పౌరాణిక పాత్రలు, వాటిని పోలి ఉండే సామాజిక పాత్రలు పోషించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే అహల్య తరహా పాత్రను ఓ షార్ట్ ఫిలింలో పోషించింది. దానికి యూట్యూబ్లో దాదాపు 45 లక్షలకు పైగా హిట్లు వచ్చాయి. ఇప్పుడు తాను ద్రౌపది పాత్ర పోషిస్తానంటూ.. బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ ముందుకొచ్చింది. ద్రౌపది చాలా శక్తిమంతమైన మహిళ అని.. అందుకే ఆ పాత్ర చేయాలని తనకు ఉందని మల్లిక ఓ కార్యక్రమంలో చెప్పింది. చివరిసారిగా ఆమె కేసీ బొకాడియా తీసిన 'డర్టీ పాలిటిక్స్' సినిమాలో నటించింది. తనకు చాలా ఆఫర్లు వస్తున్నాయి గానీ, సరైన స్క్రిప్టు, సరైన సినిమాను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు చెప్పింది!