బాలీవుడ్ నటి రియా చక్రవర్తి తన సినిమాలపై దృష్టి సారించింది. అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీలతో కలిసి నటించిన 'చెహ్రే' సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా తాజాగా ఆమెకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు బీటౌన్‌లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. మహాభారతాన్ని ప్రేరణగా తీసుకుని తెరకెక్కుతున్న సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రియాను సంప్రదించారట. ఇందులో ఆమె ఆధునిక ద్రౌపదిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ సినిమా ఇంకా ప్రారంభ దశలోనే ఉందట. మరి ద్రౌపది పాత్ర చేయడానికి రియా అంగీకరించిందా? లేదా? అన్నది కూడా తెలియాల్సి ఉంది.
కాగా 'తూనీగ తూనీగ' అనే తెలుగు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన రియా.. బ్యాంక్ చోర్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, మేరే డాడ్ కీ మారుతి వంటి హిందీ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ కోణంలో గతేడాది రియా అరెస్టైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ నటి ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటపడుతోంది. గత కొద్ది రోజులుగా మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇటీవల టైమ్స్ విడుదల చేసిన '50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020' జాబితాలోనూ రియా చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.
చదవండి: 'బాలీవుడ్‌లో ఛాన్సులు లేక టాలీవుడ్ వైపు చూస్తున్న రియా'
Comments
Please login to add a commentAdd a comment