mythological role
-
Video Game: భీముడిలా పోరాడొచ్చు.. కురుక్షేత్ర యుద్ధం చేయొచ్చు
న్యూఢిల్లీ: హిందూ పురాణ పాత్రలతో కూడిన వీడియో గేమింగ్‌లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో కంపెనీలు కొత్త కొత్త పాత్రలతో కూడిన గేమ్‌లను రూపొందిస్తున్నాయి. దీంతో భీముడు, సూర్పణక, అర్జునుడు, సుగ్రీవుడు తదితర పాత్రలతో కూడిన గేమ్‌లు దర్శనమివ్వనున్నాయి. దేశీ గేమింగ్ బూమ్ నేపథ్యంలో ఈ తరహా క్యారక్టర్ల పట్ల యూజర్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. డిమాండ్ వాతావరణం బాగుండడంతో కంపెనీలు చేపట్టే కొత్త ప్రాజెక్టులకు ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడిదారులు మద్దతుగా నిలుస్తున్నారు. ‘కురుక్షేత్ర: ఆసెన్సన్’ అనే స్ట్రాటజీ విడియోగేమ్‌ను అభివృద్ధి చేసిన స్డూడియోసిరాహ్ 8,30,000 డాలర్ల నిధులను ప్రముఖ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించడం గమనార్హం. లిమికాయ్ ఫండ్, ఇన్‌మొబి సహ వ్యవస్థాపకుడు పీయూష్ షా, స్వీడిష్ గేమింగ్ కంపెనీ స్టిల్‌ఫ్రంట్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆలెక్సిస్ బాంటే, నాడ్విన్ గేమింగ్ వ్యవస్థాపకుడు అక్షత్‌రాథీ పెట్టుబడులు పెట్టిన వారిలో ఉన్నారు. మార్కెట్ పెద్దదే.. మరోవైపు ఇండస్ గేమ్ రూపకర్త ‘సూపర్ గేమింగ్’ సైతం సిరీస్–ఏ రౌండ్లో భాగంగా 5.5 మిలియన్ డాలర్లను సమీకరించింది. స్కైక్యాచర్, ఏఈటీ ఫండ్, బీఏస్ క్యాపిటల్, డ్రీమ్ ఇంక్యుబేటర్, 1అప్ వెంచర్స్, ఐసెర్టిస్ సహ వ్యవస్థాపకుడు మోనిష్ దర్దా ఈ పెట్టుబడులు సమకూర్చారు. భారత గేమింగ్ పరిశ్రమ భిన్నమైన గేమ్‌లతో పరిపక్వ దశలో ఉన్నట్టు కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ ఇటీవలో ఓ నివేదికలో పేర్కొనడం గమనార్హం. ‘‘గేమింగ్ కంపెనీలకు యూజర్ల అభిరుచులే ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నాయి. గేమింగ్ ప్రియులు భారతీయ కంటెంట్‌తో కూడిన వాటిని ఆదరిస్తున్నారు. భారత పురాణ పాత్రలతో కూడిన వాటి పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు’’ అని రెడ్‌సీర్ తెలిపింది. ‘‘ప్రజలకు తెలిసిన పాత్రలతో గేమ్‌లను రూపొందించి వారికి చేరువయ్యే ప్రయత్నాన్ని కంపెనీలు చేస్తున్నాయి. మహాభారత, రామాయణంలోని పాత్రలను చిన్న నాటి నుంచి పెరుగుతూనే తెలుసుకుంటాం. వీటిని అర్థం చేసుకునేందుకు ప్రత్యేక శ్రమ పెట్టక్కర్లేదు’’ అని స్టూడియో సిరాహ్ సహ వ్యవస్థాపకుడు అబ్బాస్‌షా తెలిపారు. కురుక్షేత్ర గేమ్‌ను బీటా వెర్షన్లో 100 మంది యూజర్లకు ఆహ్వాన విధానంలో అందించామని, వాణిజ్య పరంగా వచ్చే ఏడాది విడుదల చేస్తామని చెప్పారు. భారత మార్కెట్టే కాకుండా.. దక్షిణాసియా దేశాల్లోనూ భారత పురాణ పాత్రల పట్ల ఆసక్తి ఉందన్నారు. చదవండి: వీడియో గేమ్‌లో అన్నదమ్ములు.. పేరెంట్స్ ఖాతా నుంచి లక్ష ఖర్చు -
సవాల్‌కి సై అంటున్న టాప్ హీరోయిన్స్
చిట్టిపొట్టి దుస్తులు... రెండు మూడు పాటలు... హీరోని ప్రేమలో పడేయడానికి పడే పాట్లు... కథానాయికల పాత్రలు దాదాపు ఇలానే ఉంటాయి. అందుకే నిండైన దుస్తులు... మెండైన నటన కనబరిచే అవకాశం వస్తే ఎడారిలో ఒయాసిస్సులా భావిస్తారు. అది కూడా పౌరాణిక పాత్రలంటే చెప్పక్కర్లేదు.. పెద్ద సవాల్. ఆ సవాల్‌ని స్వీకరించారు కొందరు నాయికలు. ఏరికోరి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అసలు సిసలైన పురాణ స్త్రీల్లా ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయ్యారు. గ్లామర్, లేడీ ఓరియంటెడ్, నెగటివ్ షేడ్స్ (‘సూపర్ డీలక్స్’ సినిమా, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్).. ఇలా తన యాక్టింగ్లోని భిన్న కోణాలను ఆవిష్కరించారు సమంత. యాభైకి పైగా సినిమాలు చేశారామె. కానీ కెరీర్లో తొలిసారి మైథాలజీ ఫిల్మ్ ‘శాకుంతలం’ చేశారు. దుష్యంతుడు, శకుంతల ప్రేమకావ్యం ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా మలయాళ యాక్టర్ దేవ్ మోహన్ నటించారు. ‘‘శకుంతల పాత్రను నేను జీవితాంతం మర్చిపోలేను’’ అని ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా పేర్కొన్నారు సమంత. దీన్నిబట్టి ఈ పౌరాణిక పాత్ర చేయడంపట్ల ఆమె ఎంత సంతృప్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మహా సాధ్వి సీత పాత్రను అంగీకరించి, పెద్ద సాహసమే చేశారు కంగనా రనౌత్, కృతీ సనన్. సీత పాత్ర అంటే కత్తి మీద సామే. ఎందుకంటే ఆ పాత్ర అంటే అంజలీ దేవినే గుర్తొస్తారు. ఆ తర్వాత సీత పాత్రలో నయనతార మెప్పించగలిగారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’లో సీత పాత్ర చేస్తున్నారు కృతీ సనన్. తన కెరీర్లో ఇంతకుముందు ‘కళంక్’ వంటి పీరియాడికల్ ఫిల్మ్ చేసినప్పటికీ మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్ చేయడం ఇదే తొలిపారి. అందుకే వేషధారణ, హావభావాల పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారట కృతీ సనన్. ఇక బాలీవుడ్లో బయోపిక్స్ అండ్ లేడీ ఓరియంటెడ్ ఫిలింస్‌కు ఓ కేరాఫ్ అడ్రస్‌గా మారారు కంగనా రనౌత్. ఇప్పటికే స్వాతంత్య్ర సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీభాయ్ (మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ), తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత (తలైవి)గా నటించిన కంగన తాజాగా భారత మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ (ఎమర్జెన్సీ) పాత్ర చేస్తున్నారు. అలాగే పౌరాణిక చిత్రం ‘సీత: ది ఇన్కార్నేషన్’లో సీతగా నటించనున్నారు. ఇంకోవైపు సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకోన్ కూడా పురాణ స్త్రీగా కనిపించనున్నారు. 2018లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘పద్మావత్’ చిత్రంలో రాణీ పద్మావతిగా దీపికా పదుకోన్ అభినయం అద్భుతం. పద్మావతి పాత్రలో దీపిక ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులకు నచ్చింది. ఆ ఉత్సాహంతోనే మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన ద్రౌపది పాత్రలో నటించేందుకు ఇటీవల పచ్చజెండా ఊపారు దీపికా పదుకోన్. ద్రౌపది కోణంలో ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రాన్ని రెండు లేదా మూడు భాగాలుగా తీయాలనుకుంటున్నారు.ఈ నాయికలే కాదు.. రామాయణం, మహాభారతాల ఆధారంగా రూపొందుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో మరికొందరు తారలు పురాణ స్త్రీలుగా కనిపించనున్నారు. -
ద్రౌపదిగా చేయాలని.. మల్లిక తహతహ!
ఇటీవలి కాలంలో బాలీవుడ్ హీరోయిన్లంతా పౌరాణిక పాత్రలు, వాటిని పోలి ఉండే సామాజిక పాత్రలు పోషించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే అహల్య తరహా పాత్రను ఓ షార్ట్ ఫిలింలో పోషించింది. దానికి యూట్యూబ్‌లో దాదాపు 45 లక్షలకు పైగా హిట్లు వచ్చాయి. ఇప్పుడు తాను ద్రౌపది పాత్ర పోషిస్తానంటూ.. బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ ముందుకొచ్చింది. ద్రౌపది చాలా శక్తిమంతమైన మహిళ అని.. అందుకే ఆ పాత్ర చేయాలని తనకు ఉందని మల్లిక ఓ కార్యక్రమంలో చెప్పింది. చివరిసారిగా ఆమె కేసీ బొకాడియా తీసిన 'డర్టీ పాలిటిక్స్' సినిమాలో నటించింది. తనకు చాలా ఆఫర్లు వస్తున్నాయి గానీ, సరైన స్క్రిప్టు, సరైన సినిమాను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు చెప్పింది!