
సినిమావాళ్లొద్దు.. నిజమైన ప్రేమికుడు కావాలి: మల్లికా షెరావత్
అందాల ఆరబోతకు, శృంగార సన్నివేశాల్లో నటించేందుకు అభ్యంతరం పెట్టని బాలీవుడ్ మెరుపు తీగ మల్లికా షెరావత్.. తనకు మాత్రం గ్లామర్ ప్రపంచానికి సంబంధించిన వ్యక్తులెవరూ నచ్చరని సెలవిచ్చింది. నిజమైన ప్రేమ కోసం అన్వేషిస్తున్నానని, అందులోనూ భారతీయుడై ఉండాలని షరతు విధించింది. సినీ పరిశ్రమకు చెందిన వారిని పెళ్లి చేసుకోబోనని, ఈ రంగానికి చెందిన వారు ఎవరూ తనను ఆకర్షించలేరని చెప్పింది. ప్రస్తుతం ఒంటరి జీవితం గడుపుతున్న మల్లిక తోడు కోసం అన్వేషిస్తోంది.
ఓ టీవీ షోలో పాల్గొన్నంటున్న మల్లిక.. ఈ కార్యక్రమం ద్వారా తనకు నచ్చినవాడిని వెతుకున్నే ప్రయత్నం చేస్తోంది. గ్లామర్, సినిమాలు నిజమైన ప్రపంచం కావని, తనకు వాస్తవిక ప్రపంచంలో జీవించాలని ఉందని మల్లిక అంది. అందుకే చాలామంది తారలు సినీ పరిశ్రమ బయటి వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంటారని మాధురీ దీక్షిత్, శిల్పాశెట్టిని ఉదహరించింది.