ముంబై: భార్యపై దాడికి పాల్పడిన కేసులో బాలీవుడ్ నటుడు ఓంపురిని ముంబైలోని వెర్సోవా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. తర్వాత రూ.10 వేల పూచీకత్తు సమర్పించడంతో ఆయనను విడుదల చేశారు. ఓంపురి ఆగస్టు 22న తనను ఒక కర్రతో తీవ్రంగా కొట్టినట్లు ఆయన భార్య నందిత ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో ఓంపురి స్వయంగా లొంగిపోవడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఆయన రూ.10 వేలకు పూచీకత్తు బాండు సమర్పించడంతో ఆయనను విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.
భార్యపై దాడి కేసులో ఓంపురి అరెస్టు
Published Sun, Sep 1 2013 2:53 AM | Last Updated on Fri, Jul 27 2018 2:26 PM
Advertisement
Advertisement