గృహ హింస కేసుపై స్పందించిన బాలీవుడ్ నటుడు ఓం పురి!
తనపై నమోదైన గృహ హింస కేసుపై బాలీవుడ్ నటుడు ఓం పురి స్పందించాడు. నందితా తనను టార్గెట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. ఈ వివాదం రేపు కోర్టులో విచారణకు వస్తుంది. త్వరలోనే వాస్తవాలు తెలుస్తాయి అని ఓం పురి పీటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
గత 35 సంవత్సరాలు సినీ పరిశ్రమలో పనిచేస్తున్నానని, సుమారు 250 చిత్రాల్లో నటించానని, అయితే తనపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఓం పురి తెలిపారు. తన భార్య ఆరోపణలన్ని అవాస్తవాలని, తన కుమారుడి క్షేమం గురించి ఆలోచించడం కారణంగా తాను మౌనం వహిస్తున్నానని ఓం పురి తెలిపారు.
ఓం పురిపై ఆయన భార్య నందిత వెర్సోవా పోలీసు స్టేషన్ లో గృహ హింస కేసు నమోదు చేసింది. ముంబైలోని వెర్సోవా ప్రాంతంలోని తమ ఫ్లాట్ లో తనను కర్రతో కొట్టారని పిర్యాదు చేసింది. అంతేకాక తన కుమారుడికి స్కూల్ ఫీజు, తనకు పురి భృతిని చెల్లించడం లేదని ఫిర్యాదులో తెలిపింది.