Versova Police
-
తాగి కారు నడిపి బాటసారిని గాయపరిచిన గీతాకపూర్
సాక్షి, ముంబై: తాగి డ్రైవింగ్ చే సి బాటసారిని గాయపరిచిన కేసులో ప్రముఖ బాలీవుడ్ కోరియోగ్రాఫర్ గీతా కపూర్‌ను వర్సోవా పోలీసులు అరెస్టు చేశారు. అయితే అరెస్టయిన కొన్ని గంటల తర్వాత బెయిల్ మీద విడుదల ఆమెను చేశారు. వివరాల్లోకెళితే.. స్థానిక జేపీ రోడ్లో ఉన్న మెడికల్ స్టోర్ వద్ద నిలబడి ఉన్న మహమ్మద్ అనే వ్యక్తిని గీతా కపూర్ కారు ఢీకొంది. గీతా తన స్నేహితురాలిని యారి రోడ్లో దిగబెట్టి లోఖండ్‌వాలాలోని నివాసానికి వెళ్తున్నపుడు ఈ ఘటన జరిగిందని వర్సోవా సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఒకరు తెలిపారు. ఎదురుగా ద్విచక్ర వాహనం అడ్డు రావడంతోనే మహమ్మద్‌ను ఢీ కొన్నట్లు కపూర్ తెలిపారు. బాధితుడి ని అంధేరీలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితి నిలకడగానే ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపినట్లు వారు తెలిపారు. -
గృహ హింస కేసుపై స్పందించిన బాలీవుడ్ నటుడు ఓం పురి!
తనపై నమోదైన గృహ హింస కేసుపై బాలీవుడ్ నటుడు ఓం పురి స్పందించాడు. నందితా తనను టార్గెట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. ఈ వివాదం రేపు కోర్టులో విచారణకు వస్తుంది. త్వరలోనే వాస్తవాలు తెలుస్తాయి అని ఓం పురి పీటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. గత 35 సంవత్సరాలు సినీ పరిశ్రమలో పనిచేస్తున్నానని, సుమారు 250 చిత్రాల్లో నటించానని, అయితే తనపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఓం పురి తెలిపారు. తన భార్య ఆరోపణలన్ని అవాస్తవాలని, తన కుమారుడి క్షేమం గురించి ఆలోచించడం కారణంగా తాను మౌనం వహిస్తున్నానని ఓం పురి తెలిపారు. ఓం పురిపై ఆయన భార్య నందిత వెర్సోవా పోలీసు స్టేషన్ లో గృహ హింస కేసు నమోదు చేసింది. ముంబైలోని వెర్సోవా ప్రాంతంలోని తమ ఫ్లాట్ లో తనను కర్రతో కొట్టారని పిర్యాదు చేసింది. అంతేకాక తన కుమారుడికి స్కూల్ ఫీజు, తనకు పురి భృతిని చెల్లించడం లేదని ఫిర్యాదులో తెలిపింది.