ఓంపురి మృతిపై ‘ఏడీఆర్’ కేసు
ముంబై: ప్రముఖ సినీనటుడు ఓంపురి మృతికి సంబంధించి ముంబై పోలీసులు ‘ప్రమాదం వల్ల మరణించినట్లు’(ఏడీఆర్) శనివారం కేసు నమోదు చేశారు. స్వగృహంలో ఒంటరిగా ఉంటున్న ఓంపురి శుక్రవారం గుండెపోటుతో చనిపోవడం తెలిసిందే.
గుండెపోటు తర్వాత వంటగదిలో నేలపై కుప్పకూలిపోయిన ఆయనకు గాయం కూడా అయ్యింది. సాధారణ ప్రక్రియ కింద ఏడీఆర్ నమోదు చేశామని, ఓంపురి మృతిపై ఇంతవరకు అనుమానించదగ్గ అంశమేదీ బయటపడలేదని పోలీసులు తెలిపారు.