సిగరెట్లు మానేసిన ఓం పురి! | Om Puri quits smoking after cancer threat | Sakshi
Sakshi News home page

సిగరెట్లు మానేసిన ఓం పురి!

Published Mon, Jul 21 2014 11:02 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సిగరెట్లు మానేసిన ఓం పురి! - Sakshi

సిగరెట్లు మానేసిన ఓం పురి!

బాలీవుడ్ విలక్షణ నటుడు ఓం పురి సిగరెట్లు కాల్చడం మానేశాడు. నోట్లో వైట్ ప్యాచ్ రావడం, ముఖంలో కూడా కొంచెం తేడా కనిపించడంతో ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు అంతా కేన్సర్ వచ్చిందేమోనని భయపడ్డారు. ఇటీవలే నోటికి సంబంధించి చిన్న శస్త్రచికిత్స కూడా చేయించుకున్న ఓం పురి.. ఇక జన్మలో సిగరెట్లు ముట్టేది లేదంటూ వాటిని వదిలిపెట్టేశాడు.

నోట్లో వచ్చిన వైట్ ప్యాచ్ ఎంతకీ తగ్గకపోవడంతో ఆస్పత్రిలో చేరానని, దాంతో తనకు వెంటనే శస్త్రచికిత్స చేశారని ఓం పురి తెలిపాడు. అదృష్టవశాత్తు అది ఇంకా కేన్సర్ కారకంగా మారలేదని, అందువల్ల తన ప్రాణానికి వచ్చిన ముప్పేమీ లేదని చెప్పాడు. అయితే వైద్యులు మాత్రం ఆయన్ను సిగరెట్లు మానేయాల్సిందేనని గట్టిగా చెప్పారు.

ఇన్ని సంవత్సరాలుగా వాటిని ఏమాత్రం వదిలిపెట్టలేని తాను.. డాక్టర్లు చెప్పడంతో వెంటనే మరునిమిషం నుంచే సిగరెట్లు మానేసినట్లు ఓంపురి చెప్పాడు. మన ఆరోగ్యం కంటే ఏమీ ముఖ్యమైనది కాదని, ఆ విషయం తాను ఆస్పత్రిలో చేరాకే తెలిసిందని అన్నాడు. ఇక సినిమాల గురించి చెబుతూ.. భారతీయ సినిమాల్లో తనకు ఇక అవకాశాలు ఏమీ కనిపించడం లేదని, ఇన్నాళ్ల పాటు అన్ని రకాల పాత్రలు చేసిన తర్వాత ఇప్పుడు ఇంట్లో నిరుద్యోగిగా కూర్చోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే అప్పుడప్పుడు మాత్రం పాశ్చాత్య దేశాల నుంచి ఒకటీ అరా ఆఫర్లు వస్తున్నాయని, వాటివల్లే కాస్త ఊరటగా ఉంటోందని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement