cancer threat
-
కృత్రిమ తీపితో క్యాన్సర్!
వాషింగ్టన్: కూల్ డ్రింకులు తదితర బేవరేజెస్ల్లో నాన్ షుగర్ స్వీటెనర్(ఎన్ఎస్ఎస్)ల వాడకంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటిని వాడటం మానేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) మే నెలలో కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రపంచంలో అత్యంత సాధారణంగా వాడే కృత్రిమ స్వీటెనర్లలో ఒకటైన ఆస్పర్టెమ్తో క్యాన్సర్ ప్రమాదం ఉన్నదంటూ తాజాగా పరిశోధనలో తేలడంతో దీని వినియోగంపై అమెరికాలో సమీక్ష మళ్లీ మొదలైందని వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. అత్యంత విరివిగా వాడే కృత్రిమ షుగర్ పదార్థం ఒకటి క్యాన్సర్కు కారకంగా మారే అవకాశం ఉందని వచ్చే నెలలో డబ్ల్యూహెచ్వో క్యాన్సర్ రీసెర్చ్ ఏజెన్సీ ప్రకటించనుందంటూ రాయిటర్స్ తెలిపింది. ఆస్పర్టెమ్ను వాడొచ్చంటూ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని్రస్టేషన్(ఎఫ్డీఏ) 1981లోనే అనుమతులిచి్చంది. అయిదేళ్లకోసారి ఈ అనుమతిని సమీక్షిస్తూ వస్తోంది. భారత్ సహా 90కి పైగా దేశాల్లో అస్పర్టెమ్ వినియోగంలో ఉంది. ఆస్పర్టెమ్లో ఎలాంటి కేలరీలు ఉండవు. చక్కెర కంటే సుమారు 200 రెట్లు తీపిని ఇది కలిగిస్తుంది. ఆస్పర్టెమ్ను వినియోగించేందుకు 2009లో భారత ఫుడ్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్ సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) అనుమతినిచి్చంది. ఆస్పర్టెమ్ను 95% కార్పొనేటెడ్ సాఫ్ట్ డ్రింకుల్లో స్వీటెనర్గా వాడుతున్నారు. బేవరేజెస్ మార్కెట్ షేర్లో అతిపెద్దదైన రెడీ టూ డ్రింక్ టీల్లో 90% వరకు వినియోగిస్తున్నారు. మిగతా స్వీటెనర్లతో పోలిస్తే ఆస్పర్టెమ్, అసెసల్ఫేమ్–కె అనే వాటి వాడకంతో క్యాన్సర్ ప్రమాదం కాస్త ఎక్కువేనంటూ గతేడాది ఫ్రాన్సులో చేపట్టిన ఓ అధ్యయనంలో తేలింది. -
స్మార్ట్ఫోన్లతో కేన్సర్ ముప్పు లేదట!
స్మార్ట్ఫోన్ అతిగా వాడితే దాని రేడియేషన్ వల్ల చర్మ కేన్సర్ వస్తుందని ఇన్నాళ్లూ రకరకాల భయాలు ఉండేవి. కానీ, అలా భయపడక్కర్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే.. సెల్ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల వేరే ఆరోగ్య సమస్యలు వస్తాయని, ముఖ్యంగా పిల్లలకు ఇది ముప్పేనని అంటున్నారు. మొబైల్ ఫోన్ వాడకంతో పాటు ఇతర రేడియో ఫ్రీక్వెన్సీ విద్యదయస్కాంత క్షేత్రాల వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొంతకాలం క్రితం ప్రపంచ ఆరోగ్యసంస్థకు చెందిన అంతర్జాతీయ కేన్సర్ పరిశోధన సంస్థ చెప్పింది. అయితే దాన్ని నిర్ధారించడానికి పరిశోధన మాత్రం జరగలేదని తెలిపింది. ఒకే కాల్ ఎక్కువ సేపు ఉండటం.. లేదా ఎక్కువ సంఖ్యలో కాల్స్ మాట్లాడటం వల్ల మాత్రం ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మొబైల్ ఫోన్ల వల్ల కేన్సర్ రావడం గానీ, అప్పటికే ఉన్న ట్యూమర్లు మరింత ఎక్కువగా పెరగడం గానీ జరగదని పరస్ ఆస్పత్రి సీనియర్ ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ ఇందు బన్సల్ అగర్వాల్ తెలిపారు. సెల్ఫోన్ల వల్ల కొంత వేడి పుడుతుంది గానీ, అది శరీర ఉష్ణోగ్రతను పెంచేంతగా ఉండదని బీఎల్కే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన రేడియేషన్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్. హుక్కు చెప్పారు. అయితే స్మార్ట్ఫోన్లను ఎక్కువగా వాడటం వల్ల మెలటోనిన్ హార్మోన్ స్థాయి తగ్గుతుందని, దానివల్ల భావి జీవితంలో న్యూరో డీజనరేటివ్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఏకాగ్రత తగ్గడం, కంటి సమస్యలు, ఒత్తిడి పెరగడం, దీర్ఘకాలం పాటు తలనొప్పి, మానసిక స్థితిపై దుష్ప్రభావాలు, గుండె సమస్యలు, స్పెర్మ్ కౌంట్ తగ్గడం, వినికిడి శక్తి తగ్గడం లాంటివి సెల్ఫోన్ అధిక వాడకం వల్ల వస్తాయని అగర్వాల్ చెప్పారు. -
సిగరెట్లు మానేసిన ఓం పురి!
బాలీవుడ్ విలక్షణ నటుడు ఓం పురి సిగరెట్లు కాల్చడం మానేశాడు. నోట్లో వైట్ ప్యాచ్ రావడం, ముఖంలో కూడా కొంచెం తేడా కనిపించడంతో ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు అంతా కేన్సర్ వచ్చిందేమోనని భయపడ్డారు. ఇటీవలే నోటికి సంబంధించి చిన్న శస్త్రచికిత్స కూడా చేయించుకున్న ఓం పురి.. ఇక జన్మలో సిగరెట్లు ముట్టేది లేదంటూ వాటిని వదిలిపెట్టేశాడు. నోట్లో వచ్చిన వైట్ ప్యాచ్ ఎంతకీ తగ్గకపోవడంతో ఆస్పత్రిలో చేరానని, దాంతో తనకు వెంటనే శస్త్రచికిత్స చేశారని ఓం పురి తెలిపాడు. అదృష్టవశాత్తు అది ఇంకా కేన్సర్ కారకంగా మారలేదని, అందువల్ల తన ప్రాణానికి వచ్చిన ముప్పేమీ లేదని చెప్పాడు. అయితే వైద్యులు మాత్రం ఆయన్ను సిగరెట్లు మానేయాల్సిందేనని గట్టిగా చెప్పారు. ఇన్ని సంవత్సరాలుగా వాటిని ఏమాత్రం వదిలిపెట్టలేని తాను.. డాక్టర్లు చెప్పడంతో వెంటనే మరునిమిషం నుంచే సిగరెట్లు మానేసినట్లు ఓంపురి చెప్పాడు. మన ఆరోగ్యం కంటే ఏమీ ముఖ్యమైనది కాదని, ఆ విషయం తాను ఆస్పత్రిలో చేరాకే తెలిసిందని అన్నాడు. ఇక సినిమాల గురించి చెబుతూ.. భారతీయ సినిమాల్లో తనకు ఇక అవకాశాలు ఏమీ కనిపించడం లేదని, ఇన్నాళ్ల పాటు అన్ని రకాల పాత్రలు చేసిన తర్వాత ఇప్పుడు ఇంట్లో నిరుద్యోగిగా కూర్చోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే అప్పుడప్పుడు మాత్రం పాశ్చాత్య దేశాల నుంచి ఒకటీ అరా ఆఫర్లు వస్తున్నాయని, వాటివల్లే కాస్త ఊరటగా ఉంటోందని తెలిపాడు.