స్మార్ట్‌ఫోన్లతో కేన్సర్ ముప్పు లేదట! | smartphone will not give cancer, but so many other problems | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్లతో కేన్సర్ ముప్పు లేదట!

Published Tue, Feb 9 2016 9:58 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

స్మార్ట్‌ఫోన్లతో కేన్సర్ ముప్పు లేదట! - Sakshi

స్మార్ట్‌ఫోన్లతో కేన్సర్ ముప్పు లేదట!

స్మార్ట్‌ఫోన్ అతిగా వాడితే దాని రేడియేషన్ వల్ల చర్మ కేన్సర్ వస్తుందని ఇన్నాళ్లూ రకరకాల భయాలు ఉండేవి. కానీ, అలా భయపడక్కర్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే.. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల వేరే ఆరోగ్య సమస్యలు వస్తాయని, ముఖ్యంగా పిల్లలకు ఇది ముప్పేనని అంటున్నారు. మొబైల్ ఫోన్ వాడకంతో పాటు ఇతర రేడియో ఫ్రీక్వెన్సీ విద్యదయస్కాంత క్షేత్రాల వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొంతకాలం క్రితం ప్రపంచ ఆరోగ్యసంస్థకు చెందిన అంతర్జాతీయ కేన్సర్ పరిశోధన సంస్థ చెప్పింది. అయితే దాన్ని నిర్ధారించడానికి పరిశోధన మాత్రం జరగలేదని తెలిపింది.

ఒకే కాల్ ఎక్కువ సేపు ఉండటం.. లేదా ఎక్కువ సంఖ్యలో కాల్స్ మాట్లాడటం వల్ల మాత్రం ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మొబైల్ ఫోన్ల వల్ల కేన్సర్ రావడం గానీ, అప్పటికే ఉన్న ట్యూమర్లు మరింత ఎక్కువగా పెరగడం గానీ జరగదని పరస్ ఆస్పత్రి సీనియర్ ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ ఇందు బన్సల్ అగర్వాల్ తెలిపారు. సెల్‌ఫోన్ల వల్ల కొంత వేడి పుడుతుంది గానీ, అది శరీర ఉష్ణోగ్రతను పెంచేంతగా ఉండదని బీఎల్‌కే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన రేడియేషన్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్. హుక్కు చెప్పారు.

అయితే స్మార్ట్‌ఫోన్లను ఎక్కువగా వాడటం వల్ల మెలటోనిన్ హార్మోన్ స్థాయి తగ్గుతుందని, దానివల్ల భావి జీవితంలో న్యూరో డీజనరేటివ్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఏకాగ్రత తగ్గడం, కంటి సమస్యలు, ఒత్తిడి పెరగడం, దీర్ఘకాలం పాటు తలనొప్పి, మానసిక స్థితిపై దుష్ప్రభావాలు, గుండె సమస్యలు, స్పెర్మ్ కౌంట్ తగ్గడం, వినికిడి శక్తి తగ్గడం లాంటివి సెల్‌ఫోన్ అధిక వాడకం వల్ల వస్తాయని అగర్వాల్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement