quit smoking
-
టోటల్‌గా మానేశారా?
జనరల్‌గా అందరూ న్యూ ఇయర్‌కు కొత్త నిర్ణయాలు తీసుకుంటుంటారు. అయితే.. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవగన్ మాత్రం న్యూ ఇయర్ రాకముందే ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటినుంచో ఉన్న సిగరెట్ అలవాటుకు చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నారని బాలీవుడ్ టాక్. నిర్ణయించుకోవడం ఏంటీ? అల్రెడీ ఆయన 50రోజుల నుంచి సిగరెట్‌కు దూరంగా ఉంటున్నారని బాలీవుడ్ సమాచారం. ఇదంతా బాగానే ఉంది కానీ అజయ్ దేవ్గన్ గతంలో కూడా ఓ 45 రోజులపాటు సిగరెట్ అలవాటుకు దూరంగా ఉండి, మళ్లీ స్టార్ట్ చేశారట. మరి ఈసారైనా ఈ మాస్ హీరో సిగరెట్‌కు కంప్లీట్‌గా క్విట్ చెప్పాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అఫ్కోర్స్ కుటుంబ సభ్యులు కోరుకోకుండా ఉంటారా? ఆ సంగతలా ఉంచితే.. అజయ్ ప్రస్తుతం ‘టోటల్ ధమాల్’ సినిమా చేస్తున్నారు. ధమాల్, డబుల్ ధమాల్ చిత్రాలను తెరకెక్కించిన ఇంద్రకుమార్ దర్శకత్వంలోనే థర్డ్ పార్ట్‌గా ‘టోటల్ ధమాల్’ తెరకెక్కుతుంది. అజయ్ దేవగన్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్షి, జావేద్ జాఫ్రీ నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమం ముంబైలో జరిగింది. మాధురీ దీక్షిత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. మొదటి షాట్‌ను అమీర్ ఖాన్ డైరెక్ట్ చేశారు. ఆల్మోస్ట్ 17 ఇయర్స్ తర్వాత అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ కలిసి నటించనుండటం విశేషం. -
కుర్రాళ్లకు సన్నీలియోన్ పాఠాలు!
శృంగార తార సన్నీలియోన్ కుర్రాళ్లకు పాఠాలు చెబుతోంది. అయితే.. అవి ప్రేమపాఠాలు మాత్రం కాదు. సిగరెట్లు కాల్చొద్దని ప్రత్యేకంగా చెబుతోంది. ఇప్పటివరకు సిగరెట్లు కాల్చనివాళ్లయితే అసలు సరదా కోసం కూడా సిగరెట్లు ముట్టుకోవద్దని ఆమె అంటోంది. అది దీర్ఘకాలంలో మంచిది కాదని, దాంతో అంత సరదా కూడా ఏమీ ఉండదని తెలిపింది. పొరపాటున కాల్చాలని అనిపించినా, ఒకటికి రెండు సార్లు ముందు ఆలోచించాలని చెప్పింది. తను వెడ్స్ మనులో నటించిన దీపక్ డోబ్రియాల్తో కలిసి ప్రత్యేకంగా చేసిన యాంటీ స్మోకింగ్ ప్రకటన విడుదల సందర్భంగా సన్నీలియోన్ ఈ పాఠాలు వల్లించింది. పొగతాగడం ఆరోగ్యానికి హానికరమని, తన తండ్రి సిగరెట్లు తాగడం వల్ల కేన్సర్ వచ్చి మరణించారని ఆమె చెప్పింది. అందుకే అందరూ పొగతాగడం మానేసి.. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితం గడపాలని కోరింది. దురదృష్టవశాత్తు బలవంతంగా ఎవరిచేత సిగరెట్లు కాల్చడం ఆపించలేమని.. కేవలం తాము ఉన్నచోట కాల్చొద్దని మాత్రమే చెప్పగలమని అంటోంది. బహుశా ప్రభుత్వం, రెస్టారెంట్ల యజమానులు మాత్రం తమ భవనాలలో సిగరెట్లు కాల్చొద్దని చెప్పగలరేమోనంది. 11 నిమిషాలు అనే టైటిల్‌తో ఉన్న ఈ ప్రకటనకు హవాయిజాదా దర్శకుడు విభు పూరి దర్శకత్వం వహించారు. ఇందులో సీనియర్ నటుడు అలోక్‌నాథ్ కూడా నటించారు. తాను చాలా అదృష్టవంతురాలినని, తనతో నటించేవాళ్లు ఎప్పుడు సిగరెట్లు కాల్చాలన్నా.. 'మేం సిగరెట్ కాలిస్తే నీకేమైనా ఇబ్బందా' అని అడుగుతారని.. కొంచెం దూరంగా వెళ్లి కాల్చుకుంటే మంచిదని తాను వాళ్లకు చెబుతానని సన్నీ తెలిపింది. -
సిగరెట్లు మానేసిన మహేశ్ బాబు!
మహేశ్ బాబు.. ఈ పేరు వింటే చాలు.. అమ్మాయిల గుండెల్లో గుబులు పుడుతుంది. నమ్రతతో పెళ్లయినా.. గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా మహేశ్ అంటే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అలాంటి మహేశ్ బాబు.. ఒకప్పుడు చైన్ స్మోకర్ అట. సెట్ మీద ఉన్నా, బయటకు వెళ్లినా కూడా చేతిలో ఎప్పుడూ సిగరెట్టు వెలుగుతూ ఉండాల్సిందే. ఎన్నిసార్లు సిగరెట్ మానేయాలనుకున్నా కూడా మళ్లీ మళ్లీ కాలుస్తూనే ఉండేవాడట. అలాంటి సమయంలో మహేశ్ బాబుకు ఓ స్నేహితుడు పొగతాగడం మానేయడం ఎలా అనే విషయంలో సెల్ఫ్ హెల్ప్ పుస్తకం ఒకటి బహూకరించారు. ఇలాంటివి చేయడం అంటే చెప్పినంత సులభం కాదని, మానేసిన ప్రతిసారీ తనకు మళ్లీ కాల్చాలనే కోరిక చాలా గట్టిగా ఉండేదని మహేశ్ అన్నాడు. అలెన్ కార్ రాసిన ఆ పుస్తకంలో మాత్రం.. పొగతాగే అలవాటు మానేయడం ఎలా అనే విషయం చాలా బాగా రాశారని, ఆ పుస్తకం చదివిన తర్వాత తాను ఇంతవరకు అసలు సిగరెట్ అన్నదే ముట్టుకోలేదని మహేశ్ తెలిపాడు. తాను నటించే సినిమాల్లో కూడా సిగరెట్ తాగే సన్నివేశాలు వద్దనే చెబుతానని, దానివల్ల అభిమానులకు తప్పుడు సందేశం వెళ్తుందని అన్నాడు. అన్ని విషయాల్లో తమ హీరోను ఆదర్శంగా తీసుకునే యువత.. ఈ విషయంలో కూడా ఆయన్ను ఆదర్శంగా తీసుకుని వెంటనే పొగతాగే అలవాటు మానేయడం మంచిది. -
సిగరెట్లు మానేసిన ఓం పురి!
బాలీవుడ్ విలక్షణ నటుడు ఓం పురి సిగరెట్లు కాల్చడం మానేశాడు. నోట్లో వైట్ ప్యాచ్ రావడం, ముఖంలో కూడా కొంచెం తేడా కనిపించడంతో ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు అంతా కేన్సర్ వచ్చిందేమోనని భయపడ్డారు. ఇటీవలే నోటికి సంబంధించి చిన్న శస్త్రచికిత్స కూడా చేయించుకున్న ఓం పురి.. ఇక జన్మలో సిగరెట్లు ముట్టేది లేదంటూ వాటిని వదిలిపెట్టేశాడు. నోట్లో వచ్చిన వైట్ ప్యాచ్ ఎంతకీ తగ్గకపోవడంతో ఆస్పత్రిలో చేరానని, దాంతో తనకు వెంటనే శస్త్రచికిత్స చేశారని ఓం పురి తెలిపాడు. అదృష్టవశాత్తు అది ఇంకా కేన్సర్ కారకంగా మారలేదని, అందువల్ల తన ప్రాణానికి వచ్చిన ముప్పేమీ లేదని చెప్పాడు. అయితే వైద్యులు మాత్రం ఆయన్ను సిగరెట్లు మానేయాల్సిందేనని గట్టిగా చెప్పారు. ఇన్ని సంవత్సరాలుగా వాటిని ఏమాత్రం వదిలిపెట్టలేని తాను.. డాక్టర్లు చెప్పడంతో వెంటనే మరునిమిషం నుంచే సిగరెట్లు మానేసినట్లు ఓంపురి చెప్పాడు. మన ఆరోగ్యం కంటే ఏమీ ముఖ్యమైనది కాదని, ఆ విషయం తాను ఆస్పత్రిలో చేరాకే తెలిసిందని అన్నాడు. ఇక సినిమాల గురించి చెబుతూ.. భారతీయ సినిమాల్లో తనకు ఇక అవకాశాలు ఏమీ కనిపించడం లేదని, ఇన్నాళ్ల పాటు అన్ని రకాల పాత్రలు చేసిన తర్వాత ఇప్పుడు ఇంట్లో నిరుద్యోగిగా కూర్చోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే అప్పుడప్పుడు మాత్రం పాశ్చాత్య దేశాల నుంచి ఒకటీ అరా ఆఫర్లు వస్తున్నాయని, వాటివల్లే కాస్త ఊరటగా ఉంటోందని తెలిపాడు.