జనరల్‌గా అందరూ న్యూ ఇయర్‌కు కొత్త నిర్ణయాలు తీసుకుంటుంటారు. అయితే.. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవగన్ మాత్రం న్యూ ఇయర్ రాకముందే ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటినుంచో ఉన్న సిగరెట్ అలవాటుకు చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నారని బాలీవుడ్ టాక్. నిర్ణయించుకోవడం ఏంటీ? అల్రెడీ ఆయన 50రోజుల నుంచి సిగరెట్‌కు దూరంగా ఉంటున్నారని బాలీవుడ్ సమాచారం. ఇదంతా బాగానే ఉంది కానీ అజయ్ దేవ్‌గన్ గతంలో కూడా ఓ 45 రోజులపాటు సిగరెట్ అలవాటుకు దూరంగా ఉండి, మళ్లీ స్టార్ట్ చేశారట.
మరి ఈసారైనా ఈ మాస్ హీరో సిగరెట్‌కు కంప్లీట్‌గా క్విట్ చెప్పాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అఫ్‌కోర్స్ కుటుంబ సభ్యులు కోరుకోకుండా ఉంటారా? ఆ సంగతలా ఉంచితే.. అజయ్ ప్రస్తుతం ‘టోటల్ ధమాల్’ సినిమా చేస్తున్నారు. ధమాల్, డబుల్ ధమాల్ చిత్రాలను తెరకెక్కించిన ఇంద్రకుమార్ దర్శకత్వంలోనే థర్డ్ పార్ట్‌గా ‘టోటల్ ధమాల్’ తెరకెక్కుతుంది. అజయ్ దేవగన్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్షి, జావేద్ జాఫ్రీ నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమం ముంబైలో జరిగింది. మాధురీ దీక్షిత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. మొదటి షాట్‌ను అమీర్ ఖాన్ డైరెక్ట్ చేశారు. ఆల్మోస్ట్ 17 ఇయర్స్ తర్వాత అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ కలిసి నటించనుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment