
సాక్షి, ఢిల్లీ : సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే నియామకంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఆమోద ముద్ర వేశారు. నవంబర్ 18న ఆయన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతమున్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 17వ తేదీన పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. ఆ లోపే వివాదాస్పద అయోధ్య కేసులో తుది తీర్పు ఇస్తానని రంజన్ గొగోయ్ ఇంతకుముందే ప్రకటించారు.