దివంగత గాయకుడు, గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు మరణాంతరం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పద‍్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్‌లో ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గాను బాలుకు ఈ అవార్డు దక్కగా.. ఆయన తనయుడు ఎస్పీ చరణ్ అవార్డు అందుకున్నారు.
చదవండి: Padma Awards 2021: పద‍్మ అవార్డుల ప్రదానోత్సవం
కాగా 2020లో మొత్తంలో 119మందిని పద్మాలు వరించాయి. 119 మందిలో 29 మంది మహిళలు ఉండగా... 16 మందికి చనిపోయిన అనంతరం అవార్డును ప్రకటించారు. స్టార్ షట్లర్ పీవీ సింధుకు పద్మ భూషణ్, బాలీవుడ్ నటికి కంగనా రనౌత్‌కు పద్మశ్రీ, నిర్మాత ఏక్తా కపూర్, సింగర్ అద్నాన్ సమీకి పద్మశ్రీ, నిర్మాత కరణ్ జోహార్‌కు పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు. మరణానంతరం గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌కు అవార్డులను ప్రకటించారు.
Delhi: Playback singer SP Balasubrahmanyam awarded the Padma Vibhushan award posthumously. His son receives the award. #PadmaAwards2021 pic.twitter.com/HlSQGYmpxv
— ANI (@ANI) November 9, 2021
Comments
Please login to add a commentAdd a comment