
సాక్షి, హైదరాబాద్ : శీతాకాల విడిది కోసం నగరానికి వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయన గౌరవార్ధం ఆదివారం రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమానికి రాష్ర్టపతి సహా తెలంగాణ సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్, హైకోర్టు న్యాయమూర్తులు సహా సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఇండియన్ రెడ్‌క్రాస్ మొబైల్ యాప్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment