సాక్షి,అహ్మద్‌నగర్: షిర్డీ యాత్రికులకు శుభవార్త. షిర్డీ విమానాశ్రయాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం అహ్మద్‌నగర్‌లో ప్రారంభించారు. అనంతరం ముంబయికి అలయన్స్ ఎయిర్ కమర్షియల్ ఫ్లయిట్‌కు పచ్చజెండా ఊపారు.మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది.
షిర్డీ సాయిబాబా సమాధి వందేళ్ల ఉత్సవాల నేపథ్యంలో ఏడాది పొడవున జరిగే కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా కోటి మంది భక్తులు షిర్డీ తరలిరానున్నారు. విమానాశ్రయం ప్రారంభం కావడంతో ముంబయి-షిర్డీల మధ్య 240 కిమీ దూరం ప్రయాణ సమయం ఆరు గంటల నుంచి కేవలం 45 నిమిషాలకు తగ్గింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితర ప్రముఖలు పాల్గొన్నారు.