సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోమవారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఒప్పందాలపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం తొమ్మిది ద్వైపాక్షిక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. కాగా అంతకు ముందు ఇజ్రాయిల్ ప్రధానికి రాష్ట్రపతి భవన్‌లో సాదర స్వాగతం లభించింది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో పాటు, ప్రధాని మోదీ కూడా నెతన్యాహు దంపతులకు స్వాగతం పలికారు. అంతకు ముందు నెతన్యాహు దంపతులు రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. ఆరు రోజుల పర్యటన నిమిత్తం నెతన్యాహు, భార్య సారాతో కలిసి ఆదివారం భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment