
ఓట్ల రూపంలో చంద్రబాబుపై కసినంతా ప్రజలు తీర్చుకున్నారని మేకపాటి రాజమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
సాక్షి, విజయవాడ: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రేమాభిమానాలతో పాటు చంద్రబాబుపై మహా కసితో తమ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓట్ల రూపంలో చంద్రబాబుపై కసినంతా ప్రజలు తీర్చుకున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ రాక్షస పాలనకు చరమగీతం పాలన్న ఉద్దేశంతో తమకు అఖండ విజయం అందించారని అన్నారు. వైఎస్ జగన్ గొప్ప పరిపాలన ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. వైఎస్సార్ కంటే జగన్ గొప్ప పరిపాలన అందిస్తారని అభిప్రాయపడ్డారు.
మళ్లీ రాజన్న రాజ్యం రావాలని ప్రజలు కోరుకుని తమకు ఓటు వేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. పదేళ్లుగా తమ నాయకుడు వైఎస్ జగన్ పడిన కష్టానికి ప్రతిపఫలం దక్కిందని ఆయన పేర్కొన్నారు. జగన్‌లో ప్రజలు గొప్పనాయకుడిని చూశారు కాబట్టి అఖండ విజయం కట్టబెట్టారని అన్నారు.