నవంబర్‌ 1 నుంచి వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం: సీఎం జగన్‌ | YSRCP Meeting And CM YS Jagan Vijayawada Tour Live Updates | Sakshi
Sakshi News home page

YSRCP: వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమా­వేశం లైవ్‌ అప్‌డేట్స్‌

Published Mon, Oct 9 2023 7:46 AM | Last Updated on Mon, Oct 9 2023 1:19 PM

YSRCP Meeting And CM YS Jagan Vijayawada Tour Live Updates - Sakshi

వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం అప్‌డేట్స్‌

11:14AM,అక్టోబర్‌9, 2023
సీఎం జగన్‌ ప్రసంగం
చంద్రబాబు అవినీతి గురించి తెలుసు కాబట్టే కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులిచ్చాయి
చంద్రబాబుపై కక్షపూరితంగా చేసి ఉంటే కేంద్రంలో బీజేపీలో సగం మంది టీడీపీ వాళ్లే ఉన్నారు
స్పష్టమైన ఆధారాలు ఉన్నా చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దట
పచ్చ గజ దొంగలు చంద్రబాబు అరెస్ట్‌ అన్యాయం అంటున్నాయి
బాబును సమర్థించడం అంటే పేదలను వ్యతిరేకించినట్లే
 బాబును సమర్థించడం అంటే పెత్తందారి వ్యవస్తను సమర్థించడమే
బాబును సమర్థించడం అంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించడమే

కోవిడ్‌ సమయంలోనూ సంక్షేమాన్ని అందించాం
ఎన్నికల తర్వాత కూడా ఎమ్మెల్యేలు ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నారు
లంచాలు లేని పారదర్శక పాలనను గ్రామాల్లోకి తీసుకెళ్లాం
ప్రతి ఇంటిలోనూ ప్రభుత్వం చేసిన మంచి కనిపిస్తోంది

ఫిబ్రవరిలో వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో:
మార్చిలో ఎన్నికలకు సన్నద్ధం అవుదాం
నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా అడుగులు వేయాలి
గ్రామస్థాయిలో అవగాహన కల్పించే బాద్యత మీదే
సభకు వచ్చిన వారు.. రాలేకపోయిన వారు అందరూ నా దళపతులే
ఎన్నికల సంగ్రామంలో పొత్తు ప్రజలతోనే
మీ బిడ్డ పొత్తులపై ఆధారపడడు
దేవుడ్ని, ప్రజల్నే నమ్ముకున్నా

జనవరి 20 నుంచి 30 దాకా వైఎస్సార్‌ ఆసరా
ఇప్పటికే మూడు దఫాలుగా వైఎస్సార్‌ ఆసరా ఇచ్చాం
వైఎస్సార్‌ ఆసరా ద్వారా రూ. 26వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం
పొదుపు సంఘాలకు మొత్తంగా రూ. 31వేల కోట్లు అందిస్తున్నాం

జనవరి 1 నుంచి పెన్షన్‌ పెంపు
ఇచ్చిన మాట ప్రకారం రూ. 3000 పెన్షన్‌ అందిస్తాం
అవ్వా తాతలు, వితంతువులకు పెంచిన పెన్షన్‌ వర్తిస్తుంది
జనవరి 10 నుంచి వైఎస్సార్‌ చేయూత
జనవరి 10 నుంచి జనవరి 20 దాకా చేయూత ఉంటుంది
రూ. 19 వేల కోట్లు చేయూత ద్వారా అందిస్తున్నాం

డిసెంబర్‌ 11 నుంచి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం
గ్రామస్థాయిలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తిస్తాం
విజేతలు రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారు
భారత్‌ టీమ్‌లో వై నాట్‌ ఏపీ పరిస్థితి రావాలి
జనవరి 15 వరకూ ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబరం

రాబోయే కాలంలో పేదవాడికి పెత్తందార్లకు జరగబోయే యుద్ధం
పెత్తందార్లుపై గెలవాలంటే పేదవారంతా ఏకం కావాలి
రాబోయే రోజుల్లో జరిగేది క్లాస్‌ వార్‌

అక్టోబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 31వరకు బస్సుయాత్ర
మూడు ప్రాంతాల్లో బస్సుయాత్ర నిర్వహిస్తాం
బస్సుయాత్ర బృందంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలుంటారు
ప్రతి రోజూ మూడు మీటింగ్‌లు జరుగుతాయి
ప్రభుత్వం చేసిన మంచి సామాజిక న్యాయం, సాధికారత గురించి చెప్పాలి
ఇది బస్సుయాత్రే కాదు.. సామాజిక న్యాయయాత్ర
పేదవారికి జరిగిన మంచిని గురించి వివరించే యాత్ర
రాబోయే కాలంలో పేదవాడికి పెత్తందార్లకు జరగబోయే యుద్ధం


మళ్లీ జగనే ఎందుకు సీఎం కావాలో చెప్పే కార్యక్రమమే వై ఏపీ నీడ్స్‌ జగన్‌
గ్రామస్థాయిలో నిర్వహించే  కార్యక్రమానికి మీరంతా కూడా శ్రీకారం చుట్టాలి
రాష్ట్రంలో జరిగిన మంచి గురించి ప్రజలకు చెప్పాలి
2019లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న విషయాన్ని ప్రజలకు వివరించాలి

వై ఏపీ నీడ్స్‌ జగన్‌.. ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే..
ప్రజలకు మరింత మంచి చేయడానికి మళ్లీ జగన్‌ రావాలి
నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 10వరకూ వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాన్ని చేపడతాం


వైఎస్సార్‌సీపీ తప్ప ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ దేశంలోనే లేదు
జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలి
రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదు
వ్యాధి సోకిన వారికి తగిన చికిత్స ఇచ్చేందుకు సురక్ష పథకం తెచ్చాం
15వేల హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తున్నాం
సురక్ష ద్వారా కోటి 65 లక్షల ఇళ్లను కవర్‌ చేస్తున్నాం

31 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం
22 లక్షల ఇళ్లు అక్క చెల్లెమ్మల పేరుతో నిర్మాణం జరుగుతున్నాయి
ఇందులో 80శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం
విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం
పేదరికంలో ఉన్నవారు ఉన్నత స్థానానికి వచ్చేలా చర్యలు తీసుకున్నాం
అక్క చెల్లెమ్మల సాధికారతకు కృషి చేశాం

నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతానికి పైగా ఎస్పీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చాం
స్థానిక సంస్థల నుంచి కేబినెట్‌ వరకూ సామాజిక న్యాయం చేశాం

వైఎస్‌ జగన్‌ అంటే మాట నిలబెట్టుకుంటాడని నిరూపించుకున్నాం
సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు సమన్యాయం చేశాం
రూ. 2లక్షల 35వేల కోట్లు డీబీటీ ద్వారా అందించాం

ఈరోజు ఇక్కడకు వచ్చిన వారంతా నా కుటుంబ సభ్యులే
పార్టీ గుర్తు మీద ఎన్నికైన మండలి స్థాయి, ఆపై ఎన్నికైన వారందరికీ మీ తమ్ముడిగా, మీ అన్నగా నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నా
ఇక్కడ ఈ మీటింగ్‌కు రాలేకపోయినా గ్రామస్థాయిలో ఉన్న ఎంపీటీసులు, సర్పంచ్‌లు, తదితరులందరికీ నా హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నా
అధికారాన్నిప్రజలకు తొలి సేవకుడి బాధ్యతగా తీసుకున్నాం
ప్రజలకు సేవకుడిగా సేవలందించాను కాబట్టే 52 నెలల కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా పాలన అందించాం
మూడు ప్రాంతాల ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానులు

11:00AM, అక్టోబర్‌9, 2023
వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్
వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయనున్న సీఎం జగన్‌
ఏపీ వ్యాప్తంగా 8వేల మందికి పైగా హాజరైన ప్రజా ప్రతినిధులు

చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: మంత్రి విడదల రజిని
సీఎం జగన్‌ చేపట్టిన కార్యక్రమాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు
రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య సురక్ష ద్వారా మంచి వైద్యాన్ని అందిస్తున్నాం
రాష్ట్రంలో నూతనంగా 17 మెడికల్‌ కాలేజీలకు శ్రీకారం చుట్టాం

రాష్ట్రానికి మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రిగా రావాలి: ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
ప్రజలంతా జగనన్నే మా నమ్మకం అంటున్నారు

పాలనలో లోపాలను సరిదిద్దిన సంస్కర్త సీఎం జగన్‌: మోపిదేవి
సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నాం
 ఏ ఇంటికి వెళ్లినా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

మైనారిటీలకు రిజర్వేషన్‌ కల్పించిన ఘనత వైఎస్సార్‌ది: హఫీజ్‌ఖాన్‌
ప్రతి రంగంలోనూ ఏపీ దూసుకుపోతోంది
సీఎం జగన్‌ పేదల పిల్లలకు ఉన్నత చదువులు అందిస్తున్నారు
మేనిఫెస్టోలో ప్రతీ హామీని అమలు చేసిన ఘనత సీఎం జగన్‌ది

వైఎస్‌ జగన్‌ అంటే ఒక సంకల్పం: మంత్రి వేణుగోపాలకృష్ణ
సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించారు
బడుగు, బలహీన వర్గాలకు కేబినెట్‌లో స్థానం కల్పించారు
పేదరికాన్ని రూపుమాపడమే సీఎం జగన్‌ లక్ష్యం



రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తోంది: మంత్రి మేరుగ నాగార్జున
బడుగు, బలహీన వర్గాలకు మనోధైర్యం పెరిగింది
పేదలకు కార్పోరేట్‌ వైద్యం అందిస్తున్న ఘనత సీఎం జగన్‌ది

09:13AM
సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు
పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్న పోలీసులు 
ముందుగా జారీ చేసిన పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతి

08:00AM
వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు ఘుమఘమలాడే విందు భోజనం
చికెన్ ధమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, చికెన్ 65, పీతలపులుసు, అపోలో ఫిష్, బొంబిడాయల పులుసు, కోడిగుడ్డు వేపుడు, రొయ్యల కూర, బ్రెడ్ హల్వా, పెరుగు చట్నీ, సాంబార్, పప్పు, ఐస్ క్రీం, కిళ్లీ సహా పలు వెజ్ వంటకాలు సిద్ధం
కౌంటర్ల వారీగా భోజన ఏర్పాట్లు
మొత్తం 100కి పైగా వెజ్ అండ్ నాన్ వెజ్ కౌంటర్లు ఏర్పాటు

రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎన్నికలకు శ్రేణు­లను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా సోమ­వారం విజయవాడ ఇందిరా గాంధీ మున్సి­పల్‌ స్టేడియంలో పార్టీ విస్తృత స్థాయి సమా­వేశాన్ని నిర్వహిస్తున్నారు. 

ఎంపీలు, ఎమ్మె­ల్సీ­లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌­చార్జ్‌లు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షుల నుంచి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షుల వరకు 8 వేల మందికిపైగా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

గత 53 నెలలుగా సుపరి­పా­లన, సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రతి ఇం­టికీ, గ్రామానికీ, నియోజక­వర్గానికీ, జిల్లాకు, రాష్ట్రానికీ చేసిన మంచిని మరింత ప్రభా­వవంతంగా వివరించడం.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న ఎక్కడికక్కడ తిప్పికొట్టడంపై ప్రతినిధులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. 

అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు – పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా పరుగులెత్తిస్తున్న తీరును కళ్లకు కట్టినట్లుగా వివరించి.. ప్రగతిపథంలో రాష్ట్రం దూసుకెళ్లాలంటే మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాలని సూచించనున్నారు. 

ఇందుకు ‘రాష్ట్రానికి జగనే కావాలి’ (వై ఏపీ నీడ్స్‌ జగన్‌) కార్యక్రమాన్ని చేపట్టాల్సిన తీరుపై ప్రతినిధులకు మార్గ నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులు సీఎం సందేశాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్తారు. 

దేశ చరిత్రలోనే కొత్త రికార్డు
సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన తొలి ఏడాదే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేసి మేనిఫెస్టోకు సిసలైన నిర్వచనం ఇచ్చారు. ఇప్పటికే 99.5 శాతం హామీలు అమలు చేశారు. 

గత 53 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రమాణికంగా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ.4.69 లక్షల కోట్ల ప్రయోజనం పేదలకు చేకూర్చారు. దేశ చరిత్రలో ఎన్నడూ ఈ స్థాయిలో పేదలకు లబ్ధి చేకూర్చిన దాఖలాలు లేవు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు.

వార్డు, గ్రామ సచివాలయాలు, జిల్లాల పునర్విభజన ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి.. ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు. పోర్టులు, షిప్పింగ్‌ యార్డులు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేశారు.

సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయాలు సాధించడంతో పాటు తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు శాసనభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో విజయభేరి మోగించడం అందుకు నిదర్శనం. 

నిత్యం ప్రజలతో మమేకం..
అధికారంలోకి వచ్చాక అనునిత్యం ప్రజలతో సీఎం వైఎస్‌ జగన్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, ప్రజాప్రతినిధులు మేమకమవుతున్నారు. 

సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని ప్రతి ఇంటికీ వివరించడానికి 2022 మే 11న చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 
అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికీ సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా చేసిన మేలును వివరించి.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడానికి ఈ ఏడాది ఏప్రిల్‌ 7 నుంచి 29 వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమాన్ని చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement