indiragandhi municipal stadium
-
నవంబర్ 1 నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం: సీఎం జగన్
వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం అప్డేట్స్ 11:14AM,అక్టోబర్9, 2023 సీఎం జగన్ ప్రసంగం ►చంద్రబాబు అవినీతి గురించి తెలుసు కాబట్టే కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులిచ్చాయి ►చంద్రబాబుపై కక్షపూరితంగా చేసి ఉంటే కేంద్రంలో బీజేపీలో సగం మంది టీడీపీ వాళ్లే ఉన్నారు ►స్పష్టమైన ఆధారాలు ఉన్నా చంద్రబాబును అరెస్ట్ చేయొద్దట ►పచ్చ గజ దొంగలు చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అంటున్నాయి ►బాబును సమర్థించడం అంటే పేదలను వ్యతిరేకించినట్లే ► బాబును సమర్థించడం అంటే పెత్తందారి వ్యవస్తను సమర్థించడమే ►బాబును సమర్థించడం అంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించడమే ►కోవిడ్ సమయంలోనూ సంక్షేమాన్ని అందించాం ►ఎన్నికల తర్వాత కూడా ఎమ్మెల్యేలు ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నారు ►లంచాలు లేని పారదర్శక పాలనను గ్రామాల్లోకి తీసుకెళ్లాం ►ప్రతి ఇంటిలోనూ ప్రభుత్వం చేసిన మంచి కనిపిస్తోంది ►ఫిబ్రవరిలో వైఎస్సార్సీపీ మేనిఫెస్టో: ►మార్చిలో ఎన్నికలకు సన్నద్ధం అవుదాం ►నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా అడుగులు వేయాలి ►గ్రామస్థాయిలో అవగాహన కల్పించే బాద్యత మీదే ►సభకు వచ్చిన వారు.. రాలేకపోయిన వారు అందరూ నా దళపతులే ►ఎన్నికల సంగ్రామంలో పొత్తు ప్రజలతోనే ►మీ బిడ్డ పొత్తులపై ఆధారపడడు ►దేవుడ్ని, ప్రజల్నే నమ్ముకున్నా ►జనవరి 20 నుంచి 30 దాకా వైఎస్సార్ ఆసరా ►ఇప్పటికే మూడు దఫాలుగా వైఎస్సార్ ఆసరా ఇచ్చాం ►వైఎస్సార్ ఆసరా ద్వారా రూ. 26వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం ►పొదుపు సంఘాలకు మొత్తంగా రూ. 31వేల కోట్లు అందిస్తున్నాం ►జనవరి 1 నుంచి పెన్షన్ పెంపు ►ఇచ్చిన మాట ప్రకారం రూ. 3000 పెన్షన్ అందిస్తాం ►అవ్వా తాతలు, వితంతువులకు పెంచిన పెన్షన్ వర్తిస్తుంది ►జనవరి 10 నుంచి వైఎస్సార్ చేయూత ►జనవరి 10 నుంచి జనవరి 20 దాకా చేయూత ఉంటుంది ►రూ. 19 వేల కోట్లు చేయూత ద్వారా అందిస్తున్నాం ►డిసెంబర్ 11 నుంచి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ►గ్రామస్థాయిలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తిస్తాం ►విజేతలు రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారు ►భారత్ టీమ్‌లో వై నాట్ ఏపీ పరిస్థితి రావాలి ►జనవరి 15 వరకూ ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబరం ►రాబోయే కాలంలో పేదవాడికి పెత్తందార్లకు జరగబోయే యుద్ధం ►పెత్తందార్లుపై గెలవాలంటే పేదవారంతా ఏకం కావాలి ►రాబోయే రోజుల్లో జరిగేది క్లాస్ వార్ ►అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31వరకు బస్సుయాత్ర ►మూడు ప్రాంతాల్లో బస్సుయాత్ర నిర్వహిస్తాం ►బస్సుయాత్ర బృందంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలుంటారు ►ప్రతి రోజూ మూడు మీటింగ్‌లు జరుగుతాయి ►ప్రభుత్వం చేసిన మంచి సామాజిక న్యాయం, సాధికారత గురించి చెప్పాలి ►ఇది బస్సుయాత్రే కాదు.. సామాజిక న్యాయయాత్ర ►పేదవారికి జరిగిన మంచిని గురించి వివరించే యాత్ర ►రాబోయే కాలంలో పేదవాడికి పెత్తందార్లకు జరగబోయే యుద్ధం ►మళ్లీ జగనే ఎందుకు సీఎం కావాలో చెప్పే కార్యక్రమమే వై ఏపీ నీడ్స్ జగన్ ►గ్రామస్థాయిలో నిర్వహించే కార్యక్రమానికి మీరంతా కూడా శ్రీకారం చుట్టాలి ►రాష్ట్రంలో జరిగిన మంచి గురించి ప్రజలకు చెప్పాలి ►2019లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న విషయాన్ని ప్రజలకు వివరించాలి ►వై ఏపీ నీడ్స్ జగన్.. ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే.. ►ప్రజలకు మరింత మంచి చేయడానికి మళ్లీ జగన్ రావాలి ►నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10వరకూ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని చేపడతాం ►వైఎస్సార్సీపీ తప్ప ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ దేశంలోనే లేదు ►జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలి ►రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదు ►వ్యాధి సోకిన వారికి తగిన చికిత్స ఇచ్చేందుకు సురక్ష పథకం తెచ్చాం ►15వేల హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాం ►సురక్ష ద్వారా కోటి 65 లక్షల ఇళ్లను కవర్ చేస్తున్నాం ►31 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం ►22 లక్షల ఇళ్లు అక్క చెల్లెమ్మల పేరుతో నిర్మాణం జరుగుతున్నాయి ►ఇందులో 80శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం ►విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం ►పేదరికంలో ఉన్నవారు ఉన్నత స్థానానికి వచ్చేలా చర్యలు తీసుకున్నాం ►అక్క చెల్లెమ్మల సాధికారతకు కృషి చేశాం ►నామినేటెడ్ పదవుల్లో 50 శాతానికి పైగా ఎస్పీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చాం ►స్థానిక సంస్థల నుంచి కేబినెట్ వరకూ సామాజిక న్యాయం చేశాం ►వైఎస్ జగన్ అంటే మాట నిలబెట్టుకుంటాడని నిరూపించుకున్నాం ►సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు సమన్యాయం చేశాం ►రూ. 2లక్షల 35వేల కోట్లు డీబీటీ ద్వారా అందించాం ►ఈరోజు ఇక్కడకు వచ్చిన వారంతా నా కుటుంబ సభ్యులే ►పార్టీ గుర్తు మీద ఎన్నికైన మండలి స్థాయి, ఆపై ఎన్నికైన వారందరికీ మీ తమ్ముడిగా, మీ అన్నగా నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నా ►ఇక్కడ ఈ మీటింగ్‌కు రాలేకపోయినా గ్రామస్థాయిలో ఉన్న ఎంపీటీసులు, సర్పంచ్‌లు, తదితరులందరికీ నా హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ►అధికారాన్నిప్రజలకు తొలి సేవకుడి బాధ్యతగా తీసుకున్నాం ►ప్రజలకు సేవకుడిగా సేవలందించాను కాబట్టే 52 నెలల కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా పాలన అందించాం ►మూడు ప్రాంతాల ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానులు 11:00AM, అక్టోబర్9, 2023 ►వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయనున్న సీఎం జగన్ ►ఏపీ వ్యాప్తంగా 8వేల మందికి పైగా హాజరైన ప్రజా ప్రతినిధులు ►చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: మంత్రి విడదల రజిని ►సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ►రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య సురక్ష ద్వారా మంచి వైద్యాన్ని అందిస్తున్నాం ►రాష్ట్రంలో నూతనంగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం ►రాష్ట్రానికి మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రిగా రావాలి: ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ►ప్రజలంతా జగనన్నే మా నమ్మకం అంటున్నారు ►పాలనలో లోపాలను సరిదిద్దిన సంస్కర్త సీఎం జగన్: మోపిదేవి ►సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నాం ► ఏ ఇంటికి వెళ్లినా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ►మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్సార్‌ది: హఫీజ్‌ఖాన్ ►ప్రతి రంగంలోనూ ఏపీ దూసుకుపోతోంది ►సీఎం జగన్ పేదల పిల్లలకు ఉన్నత చదువులు అందిస్తున్నారు ►మేనిఫెస్టోలో ప్రతీ హామీని అమలు చేసిన ఘనత సీఎం జగన్‌ది ►వైఎస్ జగన్ అంటే ఒక సంకల్పం: మంత్రి వేణుగోపాలకృష్ణ ►సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించారు ►బడుగు, బలహీన వర్గాలకు కేబినెట్లో స్థానం కల్పించారు ►పేదరికాన్ని రూపుమాపడమే సీఎం జగన్ లక్ష్యం ►రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తోంది: మంత్రి మేరుగ నాగార్జున ►బడుగు, బలహీన వర్గాలకు మనోధైర్యం పెరిగింది ►పేదలకు కార్పోరేట్ వైద్యం అందిస్తున్న ఘనత సీఎం జగన్‌ది 09:13AM ►సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు ►పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్న పోలీసులు ►ముందుగా జారీ చేసిన పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతి 08:00AM ►వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు ఘుమఘమలాడే విందు భోజనం ►చికెన్ ధమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, చికెన్ 65, పీతలపులుసు, అపోలో ఫిష్, బొంబిడాయల పులుసు, కోడిగుడ్డు వేపుడు, రొయ్యల కూర, బ్రెడ్ హల్వా, పెరుగు చట్నీ, సాంబార్, పప్పు, ఐస్ క్రీం, కిళ్లీ సహా పలు వెజ్ వంటకాలు సిద్ధం ►కౌంటర్ల వారీగా భోజన ఏర్పాట్లు ►మొత్తం 100కి పైగా వెజ్ అండ్ నాన్ వెజ్ కౌంటర్లు ఏర్పాటు ►రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా సోమవారం విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ►ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షుల నుంచి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షుల వరకు 8 వేల మందికిపైగా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ►గత 53 నెలలుగా సుపరిపాలన, సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రతి ఇంటికీ, గ్రామానికీ, నియోజకవర్గానికీ, జిల్లాకు, రాష్ట్రానికీ చేసిన మంచిని మరింత ప్రభావవంతంగా వివరించడం.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న ఎక్కడికక్కడ తిప్పికొట్టడంపై ప్రతినిధులకు సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. ►అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు – పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా పరుగులెత్తిస్తున్న తీరును కళ్లకు కట్టినట్లుగా వివరించి.. ప్రగతిపథంలో రాష్ట్రం దూసుకెళ్లాలంటే మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాలని సూచించనున్నారు. ►ఇందుకు ‘రాష్ట్రానికి జగనే కావాలి’ (వై ఏపీ నీడ్స్ జగన్) కార్యక్రమాన్ని చేపట్టాల్సిన తీరుపై ప్రతినిధులకు మార్గ నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులు సీఎం సందేశాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్తారు. దేశ చరిత్రలోనే కొత్త రికార్డు ►సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తొలి ఏడాదే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేసి మేనిఫెస్టోకు సిసలైన నిర్వచనం ఇచ్చారు. ఇప్పటికే 99.5 శాతం హామీలు అమలు చేశారు. ►గత 53 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రమాణికంగా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.4.69 లక్షల కోట్ల ప్రయోజనం పేదలకు చేకూర్చారు. దేశ చరిత్రలో ఎన్నడూ ఈ స్థాయిలో పేదలకు లబ్ధి చేకూర్చిన దాఖలాలు లేవు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. ►వార్డు, గ్రామ సచివాలయాలు, జిల్లాల పునర్విభజన ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి.. ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు. పోర్టులు, షిప్పింగ్ యార్డులు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేశారు. ►సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాలు సాధించడంతో పాటు తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు శాసనభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో విజయభేరి మోగించడం అందుకు నిదర్శనం. నిత్యం ప్రజలతో మమేకం.. ►అధికారంలోకి వచ్చాక అనునిత్యం ప్రజలతో సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు, ప్రజాప్రతినిధులు మేమకమవుతున్నారు. ►సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని ప్రతి ఇంటికీ వివరించడానికి 2022 మే 11న చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ►అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికీ సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా చేసిన మేలును వివరించి.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడానికి ఈ ఏడాది ఏప్రిల్ 7 నుంచి 29 వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమాన్ని చేపట్టారు. -
రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాల ప్రదర్శన
-
సీఎం భరోసా.. దొరికింది ఆసరా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. విజయవాడలో బుధవారం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభ ముగించుకొని సీఎం తన కాన్వాయ్‌లో వెళ్తుండగా.. రోడ్డుపైన నిస్సహాయ స్థితిలో వీల్‌చైర్‌లో కూర్చున్న ఒక యువకుడిని గమనించారు. వెంటనే అతడి వైపు సీఎం తన చేయి చూపుతూ తాను ఉన్నాననే భరోసాను కల్పించారు. వెంటనే అతడి సమస్య ఏమిటో ఆరా తీయాలని తన సెక్యూరిటీ సిబ్బందిని సీఎం ఆదేశించారు. అలాగే అతడి వివరాలను తక్షణమే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా గన్నవరం విమానాశ్రయానికి వెళ్తూ కూడా ఆ యువకుడి విషయం ఎంతవరకు వచ్చిందని సీఎం జగన్ మరోసారి ఆరా తీశారు. యువకుడికి అవసరమైన సాయం అందేలా.. వైద్యానికి అవసరమైన ఖర్చును అంచనా వేసి తనకు వివరాలు పంపాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో తక్షణమే స్పందించిన విజయవాడ కలెక్టర్ ఢిల్లీ రావు స్వయంగా తన వాహనాన్ని యువకుడి ఉన్న చోటుకు పంపి అతడిని తన కార్యాలయానికి రప్పించారు. అతడి పరిస్థితిని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. వెంటనే డీఎంహెచ్ఓను పిలిపించి చికిత్స నిమిత్తం యువకుడిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అంతేకాకుండా తక్షణ సహాయం కింద రూ.లక్ష చెక్కును సైతం కలెక్టర్ ఢిల్లీ రావు అందజేశారు. సీఎం అండ.. తీరింది బెంగ.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చెవుటూరుకు చెందిన ఏసుబాబు, శివగంగల దంపతుల కుమారుడు లక్ష్మణ్ (20)కు రెండేళ్ల క్రితం ఓ ప్రమాదంలో తలకు బలమైన గాయమైంది. అప్పట్లో 71 రోజులు ఆస్పత్రిలోనే వైద్యం పొందినప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. లక్ష్మణ్ కాలు చచ్చుపడిపోయింది. కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులు తమకు శక్తికి మించి వైద్యం చేయించారు. అయితే ప్రతి నెలా మందులకు రూ.10 వేలు వెచ్చించడం భారంగా మారింది. మిగిలిన ఇద్దరు కుమారులు కుటుంబ పోషణ కోసం చదువు మానేసి పనులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్‌ను కలిస్తే తమకు న్యాయం జరుగుతుందని బుధవారం బాధితుడు లక్ష్మణ్ తన తల్లిదండ్రులతో విజయవాడ వచ్చాడు. సీఎం అండతో సమస్య పరిష్కారమైంది. -
చంద్రబాబు ఆ ఒక్క మాట చెప్పలేకపోతున్నాడు..!
-
బీసీలంటే పనిముట్లు మాత్రమే కాదు.. బీసీలంటే వెన్నెముక కులాలు: సీఎం జగన్
-
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: సీఎం జగన్
సాక్షి, కృష్ణా: టీడీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. కానీ, మన పాలనలో రాజ్యాధికారంలో బీసీలు భాగస్వామ్యం అయ్యారు. రాజ్యసాధికారికతకు బీసీలు నిదర్శనంగా నిలిచారు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చెప్పండని సీఎం వైఎస్ జగన్.. విజయవాడ జయహో బీసీ మహాసభలో బీసీ శ్రేణులను ఉద్దేశించి పిలుపు ఇచ్చారు. ఖబడ్దార్ మీ అంతు చూస్తా అని బీసీలను చంద్రబాబు బెదిరించాడు. తోకలు కత్తిరిస్తానన్నాడు. కానీ, బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములనే విషయం చంద్రబాబుకు చెప్పండి. బీసీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని చంద్రబాబుకు గుర్తు చేయండి. చేసిన మోసాలను, నయవంచనను గుర్తు చేయండి. ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పండి అని సీఎం జగన్ ప్రసంగించారు. మీ బిడ్డ జగన్ వయసు 49 ఏళ్లు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అవుతోంది. కానీ, 2024లో ఒంటరిగా పోటీ చేస్తానని చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. చేసిందేమీ లేక అబద్ధాలతో మోసం చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే చెప్పుకోవడానికి చంద్రబాబు బీసీల కోసం ఒక్క మంచి పని చేయలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడిపై పడుతున్నాడు. చరిత్రలో ఎవరూ వేయని విధంగా అడుగులు వేశాం. బీసీ కులాలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేశాం. సంక్షేమ పథకాల్లో పేద సామాజిక వర్గాలకే పెద్ద పీట వేశాం. ఆర్థిక సాధికారత కోసం రూ.3 లక్షల 19 వేల 228 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో 80 శాతం డబ్బు పేద సామాజిక వర్గాలకు ఖర్చు చేశాం. చంద్రబాబు హయాంలో అప్పుల్లో పెరుగుదల రేటు 19 శాతం. అప్పుడు ఆ రేటు కేవలం 15 శాతం మాత్రమే అని సీఎం జగన్ ప్రకటించారు. చంద్రబాబు హయాంలో పథకాలు ఎందుకు లేవో ప్రజలే ఆలోచించుకోవాలి. దోచుకో.. పంచుకో.. తినుకో ఇదే చంద్రబాబు విధానం అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఆత్మ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమమే. గడప గడపకు నవరత్నాలు అందించడమే లక్ష్యం. ప్రతి గడపకు అందే సామాజిక న్యాయం, సాధికారతే నవరత్నాలు అని సీఎం జగన్ మరోసారి ప్రకటించారు. ఎస్సీల్లో ఎవరైనా పుడతారా? అని చంద్రబాబు హేళన చేశారు. కానీ, మన హయాంలో అన్ని వర్గాలను గుండెల్లో పెట్టుకున్నాం. ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధికారతకు కృషి చేశాం. ఎక్కడా అవినీతికి అవకాశం లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నాం అని సీఎం జగన్ చేశారు. బాబుకు చివరి ఎన్నికలే! 2024 ఎన్నికలు ఖచ్చితంగా చంద్రబాబుకు చివరి ఎన్నికలే. మనమంతా మారీచులు, పెత్తందారులతో యుద్ధం చేయక తప్పదు. చంద్రబాబు, ఆయన బ్యాక్‌బోన్ ఎల్లో బ్రదర్స్, దత్తపుత్రుడు ఏ సామాజిక వర్గానికి ప్రతినిధులో ఆలోచన చేయాలి. పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టులో కేసు వేస్తారు వీళ్లు. పేదల శత్రువు, ఆయన పెత్తందారులు. వాళ్లకు ఏనాడూ మంచి బుద్ధి లేదు. వైఎస్ఆర్సీపీ సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. మానవతా వాదానికి వైఎస్ఆర్సీపీ ప్రతీక. నిజాయితీకి వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరగబోతోంది. 2024లో ఇంతటికి మించిన గెలుపు ఖాయమని చెప్పండి అని బీసీ శ్రేణులను ఉద్దేశించి సీఎం జగన్ పిలుపు ఇచ్చారు. ప్రతి గడపకు వాస్తవ పరిస్థితిని తీసుకెళ్లాలి. మంచి జరిగితేనే జగనన్నకు తోడు ఉండండని చెప్పండి. చంద్రబాబు అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పండి అని జయహో బీసీ మహాసభకు హాజరైన సుమారు 85 వేలమంది బీసీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి పేర్కొన్నారు. -
బీసీలంటే బ్యాక్‌బోన్ క్లాసులు: సీఎం జగన్
సాక్షి, కృష్ణా: నాగరికతకు పట్టుకోమ్మలు బీసీలు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివర్ణించారు. బుధవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వైఎస్ఆర్సీపీ జయహో బీసీ మహాసభలో ఆయన ప్రసంగించారు. బీసీలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. వార్డు మెంబర్ల దగ్గరి నుంచి తన కేబినెట్లోని మంత్రులకు, ఢిల్లీ వరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు స్వాగతం. నా బీసీ కుటుంబం జనసముద్రంలా నా ముందు ఉంది. మీ హృదయంలో జగన్.. నా హృదయంలో మీరు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని.. బ్యాక్‌బోన్ క్లాసులు అని, వెనుకబాటు కులాలు కాదని.. వెన్నెముక కులాలు అని చాటిచెప్పే అడుగులు ఈ మూడున్నరేళ్ల కాలంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పడుతున్నాయి. బీసీ అంటే శ్రమ.. బీసీ అంటే పరిశ్రమ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ దేశ సంస్కృతికి, సంప్రదాయానికి ఉన్నంత చరిత్ర బీసీలకు ఉందని తెలిపారు. పారిశ్రామిక విప్లవం బీసీలను వెనక్కి నెట్టింది. ఆధునిక విద్య బీసీలను వెనకబాటుకు గురి చేసిందని సీఎం జగన్ పేర్కొన్నారు. బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు.. వెన్నెముక కులాలు చేస్తానని చెప్పాను. నేడు రాజ్యాధికారంలో వారిని భాగస్వాముల్ని చేశానని సీఎం జగన్ గుర్తు చేశారు. బీసీ కులాలన్నింటికీ మేలు చేస్తామని పాదయాత్రలో చెప్పాను. రాజ్యాధికారంలో బీసీలను భాగస్వామ్యం చేశాం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని మేం అమలు చేశాం. దేశంలోనే తొలిసారిగా శాశ్వత బీసీ కమిషన్ తెచ్చాం. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాం. మరోవైపు అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత పథకాల ద్వారా ఆదుకుంటున్నాం. చిరువ్యాపారులకు తోడుగా ఉండేందుకు జగనన్న చేదోడు పథకం తెచ్చాం. చేయూత పథకం కింద రూ.14,110 కోట్లు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చాం. తిరుమలలో సన్నిధి గోల్లలకు తలుపులు తెరిచే సంప్రదాయం కల్పించాం. బీసీలంటే ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, పనిముట్లు కాదు.. వెన్నెముక కులాలు అని మరోసారి సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఈ గణాంకాలే నిదర్శనం చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపించలేదు. కానీ, మన ప్రభుత్వం ప్రతీ అడుగులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించాం. ఈ మూడున్నరేళ్లలో ఎనిమిది రాజ్యసభ స్థానాలు దక్కితే.. సగం బీసీలకే ఇచ్చాం. రాష్ట్రం విషయానికొస్తే.. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. 32 మంది ఎమ్మెల్సీలలో 18 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైన్టార్టీలే. శాసన సభ స్పీకర్‌గా బీసీ నేత తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్‌గా ఎస్సీ నేత మోషేన్‌రాజును నియమించాం. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ 32 మంది సభ్యుల్లో బీసీలే అత్యధికం. మండల పరిషత్ పదవుల్లో 67 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. రెండో విడత కేబినెట్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. కేబినెట్లో పదకొండు మంది బీసీ మంత్రులు ఉన్నారు. కేబినెట్లో 56 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్థానం కల్పించాం. రాష్ట్రంలోని 117 మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారు. మున్సిపల్ చైర్పర్సన్లలో 84లో 44 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు. 137 కార్పొరేషన్ చైర్పర్సన్లలో 79 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు. 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 బీసీలకే. ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 58 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారు. 86 శాతం మేయర్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారు. 484 డైరెక్టర్ పదవుల్లో 58 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారు. గ్రామ సచివాలయాల్లో లక్షా 30 వేల ఉద్యోగుల్లో.. 84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు. 30 లక్షల ఇళ్ల పట్టాలలో 84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. మొత్తంగా రాజకీయ, సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చాం అని సీఎం జగన్ ప్రసంగించారు. -
విజయవాడలో సీఎం జగన్ కాన్వాయ్..
-
వైఎస్ఆర్సీపీ జయహో బీసీ మహాసభ వేదికపైకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
జయహో బీసీ: ‘రాజ్యాధికారంలో బీసీలను భాగస్వాముల్ని చేశాను’
జయహో బీసీ మహాసభ.. లైవ్ అప్డేట్స్ సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ► ప్రతి గడపకు వాస్తవ పరిస్థితిని తీసుకెళ్లాలి. మంచి జరిగితేనే జగనన్నకు తోడు ఉండండని చెప్పండి. చంద్రబాబు అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పండి ► వైఎస్ఆర్సీపీ సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. మానవతా వాదానికి వైఎస్ఆర్సీపీ ప్రతీక. నిజాయితీకి వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరగబోతోంది. ► 2024 ఎన్నికలు ఖచ్చితంగా చంద్రబాబుకు చివరి ఎన్నికలే. మనమంతా మారీచులు, పెత్తందారులతో యుద్ధం చేయక తప్పదు. చంద్రబాబు, ఆయన బ్యాక్‌బోన్ ఎల్లో బ్రదర్స్, దత్తపుత్రుడు ఏ సామాజిక వర్గానికి ప్రతినిధులో ఆలోచన చేయాలి. ►రెండో విడత కేబినెట్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. కేబినెట్లో పదకొండు మంది బీసీ మంత్రులు ఉన్నారు. కేబినెట్లో 56 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్థానం కల్పించాం. ► చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపించలేదు. కానీ, మన ప్రభుత్వం ప్రతీ అడుగులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించాం. ఈ మూడున్నరేళ్లలో ఎనిమిది రాజ్యసభ స్థానాలు దక్కితే.. సగం బీసీలకే ఇచ్చాం. ► ఎస్సీల్లో ఎవరైనా పుడతారా? అని చంద్రబాబు హేళన చేశారు. కానీ, మన హయాంలో అన్ని వర్గాలను గుండెల్లో పెట్టుకున్నాం. ► వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఆత్మ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమమే. గడప గడపకు నవరత్నాలు అందించడమే లక్ష్యం. ► చరిత్రలో ఎవరూ వేయని విధంగా అడుగులు వేశాం. బీసీ కులాలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేశాం. ► టీడీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. కానీ, మన పాలనలో రాజ్యాధికారంలో బీసీలు భాగస్వామ్యం అయ్యారు. ► ఖబడ్దార్ మీ అంతు చూస్తా అని బీసీలను చంద్రబాబు బెదిరించాడు. తోకలు కత్తిరిస్తానన్నాడు. కానీ, బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములనే విషయం చంద్రబాబుకు చెప్పండి. ► మీ బిడ్డ జగన్ వయసు 49 ఏళ్లు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అవుతోంది. కానీ, 2024లో ఒంటరిగా పోటీ చేస్తానని చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. ► నా బీసీ కుటుంబం.. గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు స్వాగతం. బీసీలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నాగరికతకు పట్టుకోమ్మలు బీసీలు. నా బీసీ కుటుంబం జనసముద్రంలా నా ముందు ఉంది. మీ హృదయంలో జగన్.. నా హృదయంలో మీరు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని.. బ్యాక్‌బోన్ క్లాసులు అని, వెనుకబాటు కులాలు కాదని.. వెన్నెముక కులాలు అని చాటిచెప్పే అడుగులు. బీసీ అంటే శ్రమ.. బీసీ అంటే పరిశ్రమ. ఈ దేశ సంస్కృతికి, సంప్రదాయానికి ఉన్నంత చరిత్ర బీసీలకు ఉంది. పారిశ్రామిక విప్లవం బీసీలను వెనక్కి నెట్టింది. ఆధునిక విద్య బీసీలను వెనకబాటుకు గురి చేసింది. బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు.. వెన్నెముక కులాలు చేస్తానని చెప్పాను. నేడు రాజ్యాధికారంలో వారిని భాగస్వాముల్ని చేశాను: సీఎం జగన్ ► సీఎం జగన్ ప్రసంగం ప్రారంభం.. బీసీ సోదరులకు, అక్కచెల్లెమ్మలకు హృదయపూర్వక కృతజ్ఞతలతో మహాసభను ఉద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారాయన. ► నేతల ప్రసంగాలు పూర్తి కావడంతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.. అందరికీ అభివాదం తెలిపారు. చివరగా.. సీఎం వైఎస్ జగన్‌ను ప్రసంగానికి ఆహ్వానించారు. ► సీఎం జగన్ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహించారు. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పేదవాళ్లను చదువకు దగ్గర చేసిన ఘనత ఆయనది. ఒక యజ్ఞంలా సీఎం జగన్.. ఎన్నో సంక్షేమాలను ప్రజలు అందించారు. సీదిరి అప్పలరాజు గుర్తు చేశారు. ► మళ్లీ జగన్నే గెలిపించుకుందాం సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోనే సామాజిక న్యాయం జరిగిందని ఎమ్మెల్సీ పోతుల సునీత పేర్కొన్నారు. ఇక్కడి బీసీ నినాదాలు చంద్రబాబు గుండెల్లో వణుకు పుట్టించాలన్నారు ఆమె. బీసీల కోసం ఇంతలా కష్టపడే ముఖ్యమంత్రిని ఎవరం చూడలేదని ఆమె పేర్కొన్నారు. ధర్మానికి-అధర్మానికి.. నిజానికి-అబద్ధానికి రాబోయే రోజుల్లో యుద్ధానికి సిద్ధం కావాలని బీసీలను కోరారు ఆమె. సంక్షేమ పథకాలు కొనసాగాలన్న.. మంచి పాలన అందాలన్నా సీఎం జగన్నే మళ్లీ సీఎంగా చేసుకుందామని, దుష్టచతుష్టయానికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఆమె పిలుపు ఇచ్చారు. ► 2024 ఎన్నికలకు మేమంతా సిద్ధం వచ్చే ఎన్నికలకు మేం సిద్ధం. సీఎం జగన్ 85వేల బీసీ సైన్యాన్ని తయారు చేశారు. ఈ సైన్యాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి.. మీకు అండగా ఉంటామన్న జగనన్న వెంట నడుద్దామని బీసీలను కోరారు మంత్రి జోగి రమేష్. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడిపై పంచ్‌లు పేల్చారు జోగి రమేష్. వైఎస్ జగన్‌ను ఎదుర్కొలేని దద్దమ్మలు.. కుట్రలు చేస్తున్నారు. 2024లో 175కి 175 గెల్చి తీరుతాం అని ఆయన అన్నారు. ► బీసీలకు సీఎం జగన్ ఇచ్చింది ఆల్‌టైం రికార్డు లక్షమంది హాజరైన వైఎస్ఆర్సీపీ జయహో బీసీ మహాసభలో మాజీమంత్రి అనిల్‌యాదవ్ భావోద్వేగంగా మాట్లాడారు. బీసీలకు సీఎం జగన్ ఇచ్చిన సంక్షేమం.. ఆల్‌టైం రికార్డు. ఇదే వేదిక నుంచి ఆయన చంద్రబాబుకు చరకలు అంటించారు. చంద్రబాబు డీఎన్ఏలో ఉంది కుళ్లు, కుతంత్రం తప్ప మరేమీ లేదు. చంద్రబాబుకు బీసీలు వణుకు పుట్టిస్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్‌ను గెలిపించి తీరతాం.. 175కి 175లో గెలిపిద్దాం అని బీసీలకు పిలుపు ఇచ్చారు అనిల్ యాదవ్. ► ఇవాళ బీసీల పండుగ. బీసీల తలరాతలు మార్చిన మహానేత సీఎం జగన్ అని మంత్రి గుమ్మనూరి జయరాం పేర్కొన్నారు. ► జయహో బీసీ మహాసభకు దాదాపుగా 80వేల మందికి పైగా బీసీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారని మంత్రి కారుమూరి తెలిపారు. చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా?అని నిలదీశారు. అన్ని బీసీ కులాలకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్‌దే అని మంత్రి కారుమూరి స్పష్టం చేశారు. ► బీసీల పల్లకి మోస్తున్న మహానేత సీఎం జగన్ అని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్ పేర్కొన్నారు. పూలేకి సరిసమానమైన నేత జగన్ అని ఆమె కితాబిచ్చారు. 139 కులాలకు రాజ్యాధికారంలో స్థానం కల్పించారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. ఆయన్ని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత బీసీలదే అని ఈ సందర్భంగా మంత్రి ఉషా శ్రీ చరణ్ పిలుపు ఇచ్చారు. ► వెనుకబడిన కులాలే వెన్నెముక! నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ మహాసభను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల నుంచి భారీగా బీసీ ప్రజాప్రతినిధులు, నేతలు, శ్రేణులు ఈ సభకు హాజర్యారు. బీసీల నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగిపోయింది. సభా ప్రాంగణంలో బీసీలతో గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. 11.31AM ► వైఎస్ఆర్సీపీ జయహో బీసీ మహాసభ వేదికపైకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్. అక్కడే ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే, మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ► బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. రాజకీయ గౌరవం ఇచ్చింది సీఎం జగన్ అని మంత్రి విడదల రజని పేర్కొన్నారు. సీఎం జగన్ బీసీ బాంధవుడు. చంద్రబాబు బీసీల పట్ల రాబందు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని అన్నారామె. ► విజయవాడ జయహో బీసీ మహాసభ.. ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ► వార్డు మెంబర్ నుంచి రాజ్యసభ వరకు బీసీలకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్‌ది. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. ఆశాజ్యోతి పూలే, అంబేద్కర్ భావజాలం ఆయనది. చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని మింగేస్తారు అని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. ► బీసీల్లో పేదరికాన్ని తొలగించేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు. బీసీల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. చదవుకు పేదరికం అడ్డుకావొద్దని ఆయన భావించారు: ఎంపీ మోపిదేవి ► బీసీలే ఈ రాష్ట్రానికి వెన్నెముక అని సీఎం జగన్ భావించారు తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తా అని చంద్రబాబు బీసీలను బెదిరించారు. కానీ, బీసీలే రాష్ట్రానికి వెన్నెముక అని సీఎం జగన్ భావించారు. బీసీలకు సీఎం జగన్ ఏం చేశారో ఈ సభను చూస్తే తెలుస్తుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. బీసీలే ఈ రాష్ట్రానికి వెన్నెముక అనే భావజాలాన్ని తెచ్చింది కూడా సీఎం జగనే అని పార్థసారథి పేర్కొన్నారు. బీసీలే రాష్ట్రానికి వెన్నెముక అని సీఎం జగన్ భావించారు. రాష్ట్రంలో బీసీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. గతంలో కాళ్లు అరిగేలా తిరిగినా సంక్షేమ పథకాలు వచ్చేవి కావు. కానీ, జగన్ పాలనలో ఇంటి గడపకే సంక్షేమ పథకాలు వస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే అని పార్థసారథి పేర్కొన్నారు. ► బీసీలు బాబుకి బుద్ధి చెప్పాలి: స్పీకర్ తమ్మినేని జయహో బీసీ మహాసభలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీల తోకలు కత్తిరిస్తామన్నారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ ఏకంగా లేఖ రాశాడు. కానీ, సీఎం జగన్ బీసీలకు గొప్ప ఆత్మగౌరవం ఇచ్చారు. బీసీలకు సమున్నత స్థానం కల్పించారు. చరిత్ర తెలియనివాళ్లు బీసీల తోకలు కత్తిరిస్తారా?బీసీలు జడ్జిలుగా పనికి రారా? ముసుగులు వేసుకుని మారువేషంలో వస్తున్నారు జాగ్రత్త.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బీసీలు బుద్ధి చెప్పాలి అని తమ్మినేని పిలుపు ఇచ్చారు. బీసీలకు పదవులిచ్చి ప్రొత్సహించింది సీఎం జగన్. ఎంపీపీ పదవుల్లో 67 శాతం పదవులు కల్పించారు. బీసీలకు 56 కార్పొరేషన్లు కేటాయించారు. బీసీలంతా ఆలోచించుకుని.. సీఎం జగన్ వెంట నడవాలని తమ్మినేని సీతారాం బీసీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు స్పీకర్ తమ్మినేని. ► పదకొండు తరాల వెనుకబాటు తనానికి కారణం చంద్రబాబు కష్టం నా కులం అన్నాడు. మానవత్వం నా మతమన్నాడు. వ్యక్తిత్వం నా వర్గమన్నాడు. అదీ జగనంటే.. అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పేర్కొన్నారు. ‘‘బీసీల పక్షపాతి సీఎం జగన్. రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన వ్యక్తి కూడా. 139 బీసీ కులాలను ఏకం చేసిన నేత. చంద్రబాబు నాయుడు కేవలం కుల వృత్తులకే బీసీలను పరిమితం చేయాలనుకున్నాడు. పదకొండు తరాల వెనుకబాటుకి కారణం అయ్యాడు. కానీ, సీఎం జగన్ అలా కాదు’’ అంటూ ప్రశంసలు గుప్పించారు మంత్రి చెల్లుబోయిన. ► విజయవాడ దారులన్నీ జయహో బీసీ మహాసభ వైపే వెళ్తున్నాయి. సభ కోసం భారీ సంఖ్యలో బీసీలు తరలి వస్తున్నారు. బీసీ జయ జయ నాదాలతో విజయవాడ మారుమోగిపోతోంది. 80 వేల మంది అంచనాని దాటేసి.. సుమారు లక్ష మంది దాకా సభకు హాజరు అయ్యారు. ► ఆయనేమో బీసీలను చిన్నచూపు చూశారు బీసీలకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పించారు. బీసీలంతా సీఎం వైఎస్ జగన్ వెంటనే ఉన్నారు. బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు కల్పించిన ఘతన సీఎం జగన్‌దే. బీసీలను చంద్రబాబు చిన్నచూపు చూశారు. కించపరిచారు. అలాంటిది.. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి సీఎం జగన్ అని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. ► బీసీల ఆత్మగౌరవమే కాదు.. అభివృద్ధి జరిగింది ఏపీలో బీసీలను అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీలకు ఆత్మగౌరవాన్ని మాత్రమే కాదు.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది సీఎం జగనే అని ఉద్ఘాటించారాయన. మాయమాటలకు లొంగిపోకుండా.. మన అభివృద్ధికి పాటుపడుతున్న నిజమైన నేత వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన బీసీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ► బడుగు బలహీన వర్గాల పక్షపాతి సీఎం జగన్ వైఎస్ఆర్సీపీ ‘జయహో బీసీ మహాసభ’ ప్రారంభోపన్యాసాన్ని చేశారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బీసీ స్థితిగతులను మార్చేసిన వ్యక్తి సీఎం జగన్. సంచార జాతులను గుర్తించిన ఏకైక సీఎం కూడా ఈయనే. సీఎం జగన్ తన పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కేబినెట్లో పదకొండు మంది బీసీలకు స్థానం కల్పించారు. రాజ్యసభ పదవుల్లో సగం బీసీలకే ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల పక్షపాతి సీఎం జగన్’’ అని కొనియాడారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. 09.35AM ► వైఎస్ఆర్సీపీ జయహో బీసీ మహాసభ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభం అయ్యింది. బీసీ నేతలంతా కలిసి జ్యోతి ప్రజల్వనతో ప్రారంభించారు. అనంతరం ప్రసంగోపన్యాసం సాగుతోంది. ► బీసీలంతా సీఎం వైఎస్ జగన్ వెంటే ఉన్నారు - మంత్రి కారుమూరి ► 14 ఏళ్ల పాలనలో బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు. చంద్రబాబు బలహీనవర్గాలను కట్టుబానిసలుగా వాడుకున్నారు. బీసీలకు ఏపీలో మాత్రమే న్యాయం జరిగింది. బీసీ మహాసభ చరిత్రలో నిలిచిపోతుంది. - జోగి రమేష్ ► వెనుకబడిన కులాలే వెన్నెముక! నినాదంతో ఇవాళ(బుధవారం) విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ మహాసభను నిర్వహిస్తోంది అధికార వైఎస్సార్సీపీ పార్టీ. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి బీసీలు సభ కోసం తరలి వచ్చారు.. ఇంకా వస్తూనే ఉన్నారు. ► జయహో బీసీ మహాసభకు సీఎం జగన్ హాజరై.. ప్రసంగించనున్నారు. ► వైఎస్ఆర్సీపీ మినీ ప్లీనరీ తరహాలో ‘జయహో బీసీ మహాసభ’కు భారీ ఏర్పాట్లు చేశారు. ► బీసీ ప్రజాప్రతినిధులు వేలాదిగా తరలి రానున్నారు. భారీ సంఖ్యలో వచ్చే వారి కోసం అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేశారు. ► జయహో బీసీ మహాసభకు హాజరయ్యే వాళ్ల కోసం విజయవాడ, గుంటూరు హోటళ్లు, కమ్యూనిటీ హాళ్లలో వసతి ఏర్పాటు చేశారు. ► బీసీ మహాసభ సందర్భంగా.. విజయవాడలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో పలుచోట్ల ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. ► బీసీలను సమాజానికి వెన్నెముకలా తీర్చిదిద్దడమే లక్ష్యమని 2019 ఫిబ్రవరి 17న ఏలూరు బీసీ గర్జనలో చేసిన ప్రకటనను సీఎం జగన్ ఆచరించి చూపుతున్నారు. ఎన్నికల హామీలకు మించి అత్యధికంగా బీసీలకు ప్రయోజనం చేకూర్చారు సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జయహో బీసీ.. ఛలో విజయవాడ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ: వైఎస్సార్సీపీ బీసీ మహాసభకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం సిద్ధమైంది. ‘వెనుకబడిన వర్గాలే వెన్నెముక’ నినాదంతో బుధవారం నిర్వహిస్తున్న మహాసభకు భారీఏర్పాట్లు చేశారు. జయహో బీసీ.. అంటూ వెనుకబడిన కులాల ప్రతినిధులు ఛలో విజయవాడకు వస్తున్నారు. నగర పరిసర ప్రాంతాల్లో మహాసభకు వచ్చేవారికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు. బీసీ మహాసభకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మంగళవారమే బీసీల ర్యాలీలు బయలుదేరాయి. అనంతపురం జిల్లాతోపాటు పలు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో బీసీ ప్రతినిధుల వాహనాలు విజయవాడకు పయనమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 82,432 మంది వెనుకబడిన తరగతులకు చెందిన ప్రతినిధులకు మహాసభకు ఆహ్వానం పంపించారు. వెనుకబడిన తరగతులకు చెందిన పంచాయతీ వార్డు మెంబర్, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులతోపాటు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి సైతం జయహో బీసీ మహాసభ ఆహ్వానాలు అందాయి. పార్టీ మినీప్లీనరీ తరహాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు వస్తున్న ఆహ్వానితుల సంఖ్యకు అనుగుణంగా సభ ప్రాంగణంతోపాటు అల్పాహారం, భోజన, వసతి ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోను రెండువేల బస్సులు ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా మరో రెండువేల భారీవాహనాల్లో బీసీ ప్రతినిధులు తరలిరానున్నారు. వాటితోపాటు సమీప ప్రాంతాల నుంచి సొంత కార్లు, బైక్‌లపైన కూడా పెద్దసంఖ్యలో విజయవాడకు వస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే బీసీ ప్రతినిధులకు విజయవాడ, గుంటూరు నగరాల్లో నాలుగువేలకుపైగా హోటల్ గదులు, 150 కమ్యూనిటీ హాళ్లు, కల్యాణమండపాల్లో వసతి ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. బందరు రోడ్డులో బెంజిసర్కిల్ నుంచి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ వరకు బీసీ సభకు వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. విజయవాడ నగరం మీదుగా దూరప్రాంతాలకు వెళ్లే వాహనాలను నగర శివారు ప్రాంతాల నుంచే మళ్లిస్తున్నారు. విజయవాడ నుంచి విజయదుందుభి రాష్ట్రంలోని 139 వెనుకబడిన కులాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బీసీలు మరింత అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఈ సభను నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గడిచిన మూడున్నరేళ్లలోనే బీసీలకు అందించిన లబ్ధిని జయహో బీసీ మహాసభలో వివరించనున్నారు. రానున్న కాలంలో బీసీలకు మరింత మేలుచేసేలా స్పష్టమైన సంకేతాలు ఇవ్వనున్నారు. క్షేత్రస్థాయిలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ మహాసభ ద్వారా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది. విజయవాడ సభను విజయవంతంగా పూర్తిచేసుకున్న అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జోనల్, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో ఇదే నినాదంతో సభలు నిర్వహించి విజయదుందుభి మోగించేందుకు నాంది పలకనున్నారు. అల్పాహారంలో 9.. భోజనంలో 21 రకాల పదార్థాలు జయహో బీసీ మహాసభకు సభా ప్రాంగణం, ఆహారం, నీరు, వసతి వంటి ఏర్పాట్ల బాధ్యతల్ని మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులకు అప్పగించారు. వీరు నాలుగు రోజులుగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభకు వచ్చేవారికి 9 రకాల పదార్థాలతో అల్పాహారం, 21 రకాల పదార్థాలతో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకేసారి పదివేల మంది భోజనం చేసేలా రెండు ప్రదేశాల్లో భోజనశాలలు ఏర్పాటుచేశారు. అల్పాహారంలో ఇడ్లీ, గారె, మసాలా ఉప్మా, పొంగలి, సాంబారు, కొబ్బరి చట్నీ, టమోటా చట్నీ, స్వీట్, రవ్వకేసరి ఉన్నాయి. కాఫీ, టీ ఏర్పాటు చేశారు. మాంసాహారంలో మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, రొయ్యలు కోడిగుడ్డు కర్రీ, చేపల పులుసు, కట్టా, ఉల్లి చట్నీ, అన్నం, పెరుగు, చక్కెర పొంగలి, శాఖాహారంలో వెజ్ బిర్యాని (పనసకాయ ధమ్), పన్నీర్ గ్రీన్‌పీస్ కర్రీ, డబుల్ బీన్స్ జీడిపప్పు కర్రీ, ఉల్లి చట్నీ, టమాటాపప్పు, గోంగూర పచ్చడి, అన్నం, సాంబారు, పెరుగు, చక్కెర పొంగలి వడ్డిస్తారు. 12 గంటలకు సీఎం ప్రసంగం జయహో బీసీ.. మహాసభ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. వేదికపై బీసీ నాయకులు మాట్లాడతారు. 12 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 3.25 గంటలకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడుకు చేరుకుంటారు. 3.55 గంటల నుంచి 4.10 వరకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడినుంచి బయలుదేరి సాయంత్రం 6.20 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
మనందరి సైనికుడు పోలీస్: సీఎం జగన్
మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి ఫలాలు ఇవాళ గ్రామ గ్రామాన ఇంటింటికీ చేరుతున్నాయి. దీని వల్ల గతంలో మావోయిజం, వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సైతం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అందరి మనసులు గెల్చుకుని, అండగా నిలబడ్డాం. తద్వారా శాంతిని, భద్రతను పెంచుకోగలిగాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : ‘సమాజంలో దుష్టశక్తులను ఎదురిస్తున్నప్పుడు, శాంతిభద్రతలను కాపాడే విధుల్ని నిర్వహిస్తున్నప్పుడు ప్రాణాలను సైతం లెక్కచేయని మనందరి సైనికుడే పోలీసు సోదరుడు. శాంతిభద్రతలను కాపాడటంలో భాగంగా తనువు చాలించిన ప్రాణ త్యాగధనులకు సెల్యూట్ చేస్తున్నా..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి.. పోలీసు అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ పవిత్రమైన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారని చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పోలీసు అమర వీరుల స్థూపానికి నమస్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విధి నిర్వహణలో పోలీసులు అనుకోని సంఘటనలు ఎన్నింటినో ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారికి సమాజం, ప్రభుత్వం తరఫున మనమంతా అండగా ఉండాలని, ఉంటామని స్పష్టం చేశారు. కర్తవ్యాన్ని దైవంగా భావించి 1959 అక్టోబర్ 21న చైనా సైనికులతో సాహసోపేత పోరాటంలో ప్రాణాలర్పించిన కరణ్‌సింగ్ స్ఫూర్తితో పోలీసు అమరవీరుల సంస్మరణ దినానికి 63 ఏళ్ల క్రితం నాంది పలికారన్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమర వీరుల్ని స్మరించుకుని, వారికి నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా అమర వీరులకు, త్యాగధనులైన పోలీసు కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున, ప్రభుత్వం తరఫున సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. సంవత్సర కాలంలో దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో దాదాపు 261 మంది పోలీసులు అమరులయ్యారని, ఇందులో రాష్ట్రానికి చెందిన వారు 11 మంది ఉన్నారని చెప్పారు. వీరిలో ముగ్గురు పోలీసులు కోవిడ్ సమయంలో చనిపోయారని తెలిపారు. వీరందరి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీ పోలీసులకు సంబంధించి ఇంకా చేయాల్సినవి.. పెండింగ్‌లో ఉన్నాయని తెలుసు. వారికి వీక్లీ ఆఫ్ ఇవ్వాలన్నది నా మనసులో మాట. ఈ మధ్య కాలంలో వీక్లీ ఆఫ్ అమలవుతోందా? అని డీజీపీని అడిగాను. సిబ్బంది కొరత వల్ల అనుకున్న స్థాయిలో దాన్ని అమలు చేయలేకపోతున్నామని చెప్పారు. వెంటనే 6,511 ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేశాం. పోలీసు శాఖ కష్టనష్టాలు తెలిసిన ప్రభుత్వంగా, వారి బాగోగుల మీద శ్రద్ధ పెట్టే ప్రభుత్వంగా శాఖలో సిబ్బంది కొరతను భర్తీ చేయడానికి, పని ఒత్తిడి తగ్గించడానికి భారీ నియామకాలకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేశాం. ఈ స్థాయిలో పోలీసు ఉద్యోగాల భర్తీ గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ జరగలేదు. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కేవలం 2,700 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. మన ప్రభుత్వం చేపట్టిన కొత్త పోస్టుల భర్తీలో భాగంగా చిత్తూరు, ప్రకాశం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఐఆర్ బెటాలియన్ దళాలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. పోలీసు శాఖకు అనుసంధానంగా ఉన్న హోంగార్డుల గౌరవ వేతనం కూడా మన హయాంలోనే పెంచాం. పోలీసు ఉద్యోగాలలో వీరికి రిజర్వేషన్లు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఇదే పోలీసు శాఖలో 16 వేల మంది చెల్లెమ్మలను మహిళా పోలీసులుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే నియమించాం. పోలీసు వ్యవస్థలో నూతన మార్పులు దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసు వ్యవస్థలో నూతన మార్పులు తీసుకొచ్చాం. దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం ప్రతి జిల్లాలో చేపట్టిన విషయం అందరికీ తెలుసు. రాష్ట్రంలో దాదాపు 1.33 కోట్ల మంది అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ అయ్యింది. దాదాపు 1.17 కోట్ల అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యింది. ఆపదలో ఉన్నామని 23,039 మంది అక్కచెల్లెమ్మలు దిశ యాప్ ద్వారా సమాచారమిస్తే పోలీస్ అన్నదమ్ములు వెంటనే వెళ్లి వారికి తోడుగా నిలబడ్డారు. 2,323 కేసులు పెట్టారు. 1,237 రెస్క్యూ ఆపరేషన్లు చేసి ఆపద జరగకముందే అక్కచెల్లెమ్మలను రక్షించారు. ఇలాంటి పరిస్థితులను రాష్ట్రంలో మొట్టమొదటిసారి చూస్తున్నాం. దిశ యాప్ ద్వారా పోలీసు సోదరుడు తనకు తోడుగా ఉన్నాడన్న భరోసా అక్కచెల్లెమ్మలకు కల్పించగలిగాం. మహిళలు, పిల్లలు, అణగారిన వర్గాల భద్రతే లక్ష్యం శాంతిభద్రతల పరిరక్షణ, మహిళలు, పిల్లలు, అణగారిన సామాజిక వర్గాల భద్రత మనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలుగా ముందుకు అడుగులు వేస్తున్నాం. ఈ విషయంలో రాజీ పడొద్దని పోలీసు సోదరులందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు ఒక దళిత మహిళ వనితమ్మ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు. అంతకుముందు ఉన్న సుచరితమ్మ కూడా దళిత మహిళే. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు, అణగారిన వర్గాలకు ఎంతగా తోడుగా నిలిచిందో.. భవిష్యత్తులోనూ నిలవబోతోందని చెప్పడం కోసమే ఈ విషయం చెబుతున్నా. పోలీసులకు వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు ఈ ఏడాది నుంచి పోలీసులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డును అందించనున్నాం. ఆపదలో ఉన్న వారికి, నేరం సంభవించక మునుపే నిమిషాల్లోనే అక్కడకి చేరుకుని రక్షించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న ఐదుగురు పోలీసులను ఎంపిక చేసి ఈ అవార్డు ఇవ్వబోతున్నాం. మూడేళ్లలో మెరుగుపడిన పోలీసుల పనితీరు ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల పనితీరు గత మూడేళ్లలో మెరుగు పడింది. ఇందుకు ఓ చిన్న ఉదాహరణ.. మహిళలపై నేరాలకు సంబంధించి విచారణకు పట్టే సమయాన్ని గత ప్రభుత్వంలో కంటే గణనీయంగా తగ్గించగలిగాం. 2017లో 160 రోజులు పడితే.. 2018లో 164 రోజులు పట్టింది. మన ప్రభుత్వం వచ్చాక 2021లో అది 79 రోజులకు తగ్గింది. ఈ ఏడాదికి 42 రోజులకే తగ్గించగలిగాం. తద్వారా దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టే ఒక గొప్ప మార్పు ఇవాళ రాష్ట్రంలో కన్పిస్తోంది. దీంతో పాటు గొప్ప జవాబుదారీతనం కూడా కన్పిస్తోంది. మన పోలీసులు తీసుకొచ్చిన మార్పు ఇది. మనం తీసుకున్న అనేక చర్యలతో ప్రజల్లో చైతన్యం (అవేర్నెస్ క్రియేట్) పెంచగలించాం. టెక్నాలజీలో మార్పులు తీసుకొచ్చి.. నేరానికి సంబంధించి ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించాం. ఫిర్యాదుదారుడికి తోడుగా నిలుస్తున్నాం కాబట్టే ఫిర్యాదులు పెరిగి.. నేరాలు తగ్గుముఖం పట్టాయి. కష్ట సమయంలో గుర్తొచ్చే స్నేహితుడు పోలీస్ కష్ట సమయంలో మొదట గుర్తొచ్చే స్నేహితుడు పోలీస్. పోలీస్ సిబ్బంది పగలనక, రాత్రనక విధులు నిర్వర్తిస్తున్నారు. అటువంటి గొప్ప బాధ్యతలను నిర్వర్తిస్తున్న పోలీసుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ విప్లవాత్మక కార్యక్రమాలతో రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల సంఖ్య తగ్గింది. ఆయా ప్రాంతాల్లో యువత ఎక్కువగా జనజీవన స్రవంతిలో కలిసి అభివృద్ధి దిశగా పయనిస్తున్నారంటే.. అందులో పోలీసుల కృషి మరువలేనిది. ఏదైనా ప్రమాదం, ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు సహాయక చర్యలను అందించడంలోనూ పోలీసులు అంకిత భావంతో పని చేస్తున్నారు. – తానేటి వనిత, రాష్ట్ర హోం శాఖ మంత్రి సీఎం వైఎస్ జగన్ ప్రోత్సాహం మరువలేనిది రాష్ట్రంలో పోలీసులు గురుతర బాధ్యతలను నిర్వర్తించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సహాయసహకారాలు, ప్రోత్సాహం మరువలేనివి. మతతత్వం, ఉగ్రవాదం, అసాంఘిక కార్యక్రమాలు, చాందసవాదం వంటి అనేక సమస్యలతో పోలీసులు నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరింత సమర్థవంతంగా పనిచేసేలా సీఎం.. టెక్నాలజీని సమకూర్చారు. మన సైబర్ డేటా సెంటర్‌ను దేశం లోని అన్ని రాష్ట్రాలకు అనుసంధానిస్తూ పాస్‌వర్డ్‌ను అన్ని జిల్లాలకు అందజేశాం. తద్వారా ఎక్కడైనా ఆన్లైన్ మోసాలు జరిగితే నేరగాళ్లను సులువుగా గుర్తించడానికి వీలుంటుంది. సైబర్ కేసులను డీల్ చేయడానికి అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఇస్తున్నాం. నాటుసారా నుంచి 80% గ్రామాలకు విముక్తి కల్పించాం. విశాఖ–ఒడిశా సరిహద్దుల్లో 7,500 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశాం. ప్రభుత్వ సహకారంతో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నాం. – రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ ‘అమరులు వారు’ పుస్తకం ఆవిష్కరణ ‘అమరులు వారు‘ అనే పుస్తకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మంది అమరులైన పోలీస్ కుటుంబాలకు ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, ప్రభుత్వ ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్, ఆర్టీసీ వీసీ, ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు, అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
YS Jagan: మీ ప్రభుత్వం.. మీ సేవకుడిని
ప్రతి రూపాయీ బాధ్యతగా ఖర్చు కోవిడ్ వల్ల ప్రభుత్వానికి ఆశించిన రీతిలో ఆదాయం రాలేదు. వ్యయం మాత్రం అనుకోని విధంగా పెరిగింది. ఇలాంటి పరిస్థితి ఒక కుటుంబానికి వస్తే ఎంతగా తల్లడిల్లుతుందో అర్థం చేసుకుని ప్రభుత్వం కష్టకాలంలో పేదలకు అండగా నిలిచింది. అవినీతి, వివక్షకు తావు లేని విధంగా ప్రతి ఒక్క రూపాయీ ప్రజలకే నేరుగా ఇచ్చాం. మన ప్రభుత్వం ప్రతి రూపాయినీ బాధ్యతగా ఖర్చు చేస్తోంది. ఈ ప్రభుత్వం మీది. మీరిచ్చిన అధికారంతో నేను సేవకుడిగా మాత్రమే ఇక్కడ ఉన్నా. స్వాతంత్య్రం సిద్ధించిన 74 ఏళ్ల తరవాత కూడా కనిపిస్తున్న వ్యవస్థాగత లోపాలను సరిదిద్దేందుకే ఇక్కడ ఉన్నా. మార్పు మీరే చూడండి మన గ్రామం లేదా నగరంలో కేవలం ఈ 26 నెలల్లోనే ఎలాంటి మార్పులు వచ్చాయో ఒక్కసారి మీరే గమనించండి. సచివాలయాల్లో 500కి పైగా సేవలతో దేశంలో సరికొత్త విప్లవానికి నాంది పలికాం. 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు సచివాలయాల్లో కనిపిస్తున్నాయి. ఒక్క రూపాయి కూడా లంచాలకు తావులేకుండా ప్రతి నెల 1వతేదీన సూర్యోదయానికి ముందే తలుపు తట్టి మరీ 2.70 లక్షల మంది వలంటీర్లు ఇంటివద్దే పింఛన్లు అందచేస్తున్న వ్యవస్థ కేవలం మనకే సొంతం. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, చకచకా కడుతున్న వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, డిజిటల్ గ్రంథాలయాలు, ఇంగ్లిష్‌లో బోధించే ప్రీ ప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లతో మన గ్రామాల స్వరూపాలు మారుతున్నాయి. సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో తన సుదీర్ఘ పాదయాత్రలో స్వయంగా తెలుసుకుని ఈ 26 నెలల పాలనలో రాష్ట్ర గతిని మార్చేలా నిర్ణయాలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మన రైతులు తమ రెక్కలకు మరింత బలం కావాలని కోరుకున్నారని, వెనకబాటుకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలు మంచి భవిష్యత్తును, న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటా కోసం తపించారని చెప్పారు. అక్కచెల్లెమ్మలు మహిళా సాధికారితను, వైద్యాన్ని ఒక హక్కుగా అందించాలని ప్రజలు కోరుకున్నారని తెలిపారు. మనిషిని మనిషిగా చూస్తూ సమన్యాయంతోపాటు లంచాలు లేని పారదర్శక వ్యవస్థ రావాలని ఆరాటపడ్డారన్నారు. ఇవన్నీ అందించటమే నిజమైన పరిపాలన, ప్రజాస్వామ్యానికి, స్వాతంత్య్రానికి అర్థం అని విశ్వసిస్తూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ పరేడ్‌ను వీక్షించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శనను తిలకించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలివీ.. కొత్త లక్ష్యాలతో బాటలు వేద్దాం స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు పూర్తై 75వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ప్రతి పౌరుడికి నిండు మనసుతో శుభాకాంక్షలు చెబుతున్నా. ఒక దేశాన్ని మరో దేశం.. ఒక జాతిని మరో జాతి... ఒక మనిషిని మరో మనిషి దోచుకోలేని వ్యవస్థ సాకారం కావాలని ఆనాడు స్వాతంత్య్ర సమర యోధులు కలలుగన్నారు. మన ప్రగతి, వెనుకబాటుతనం, మంచీచెడులపై చర్చ జరగాలి. లోపాలను సరిదిద్దుకునేందుకు, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని బాటలు వేసుకునేందుకు మనందరికీ ఇది ఒక సందర్భం. ఢిల్లీ మొదలు మారుమూల పల్లె వరకు ఎగిరే ప్రతి జాతీయ జెండా ఘనమైన, పటిష్టమైన రేపటికి ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలి. ప్రజలంతా మనల్ని మనం పరిపాలించుకునే స్వాతంత్య్రంతోపాటు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణను కచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నారు. ఉదాహరణకు చదువుకునే హక్కును ఆర్టికల్ 21–ఏ ప్రకారం ప్రాథమిక హక్కుగా గుర్తించినా ఒక పేద కుటుంబానికి అలాంటి పరిస్థితుల్ని కల్పించనంత కాలం ఆ హక్కు వల్ల ప్రయోజనం ఉండదు. హక్కుల ప్రకటన, అమలుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించేందుకు గత 26 నెలలుగా ప్రతి ఒక్కటీ చేశాం. రైతు రెక్కలకు బలం.. రాష్ట్రంలో 62 శాతం జనాభాకు ఆధారమైన వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి రైతు రెక్కలకు బలం చేకూర్చి అండగా నిలిచాం. ఈ 26 నెలల్లోనే వ్యవసాయానికి దాదాపు రూ.83 వేల కోట్లు వ్యయం చేశాం. 18.70 లక్షల మంది రైతులకు పగటి పూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు ఇచ్చేందుకు దాదాపు రూ.18,000 కోట్లు ఖర్చు చేశాం. ఫీడర్ల బలోపేతం కోసం మరో రూ.1700 కోట్లు వెచ్చించాం. 52.38 లక్షల మంది రైతన్నలకు వైఎస్సార్ రైతు భరోసా ద్వారా దాదాపు రూ.17 వేల కోట్లు అందించగలిగాం. ఆర్బీకేల ఏర్పాటుతో దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా వ్యవసాయ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టాం. వైఎస్సార్ ఉచిత పంటల బీమా ద్వారా 31 లక్షల మంది రైతులకు రూ.3,788 కోట్లు అందించాం. వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా 67.50 లక్షల మంది రైతులకు మరో రూ.1,261 కోట్లు ఖర్చు చేసి తోడుగా నిలబడ్డాం. రూ.రెండు వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని, రూ.మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. ధాన్యం సేకరణ, కొనుగోళ్ల కోసం రూ.33 వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం. పత్తికి మరో రూ.1800 కోట్లు, ఇతర పంటల కొనుగోళ్లకు మరో రూ.6,434 కోట్లు వ్యయం చేశాం. ఏ ఒక్క రైతన్నకూ ఇబ్బంది రాకూడదని తపించాం. స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆకట్టుకున్న రైతు శకటం ప్రదర్శన గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలూ చెల్లించాం.. గత సర్కారు ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం బకాయిలు, రూ.9000 కోట్ల ఉచిత విద్యుత్తు బకాయిలు, రూ.384 కోట్ల విత్తన బకాయిల భారాన్ని కూడా ఈ ప్రభుత్వమే భరించి చిరునవ్వుతో రైతన్నలకు చెల్లించింది. సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే ప్రక్రియకు నాంది పలుకుతూ రూ.1,039 కోట్ల చెల్లింపులు చేశాం. అమూల్ పాలవెల్లువ, వైఎస్సార్ జలకళ, ఆక్వా రైతుకు కరెంటు సబ్సిడీకి రూ.1,500 కోట్లు ఇచ్చాం. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ముందడుగు వేశాం. నవరత్నాల పథకాల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుస్తున్నాం. ఒక హక్కులా విద్య మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి ఎదిగేలా విద్యారంగంలో సంస్కరణలు తెచ్చాం. చదువుకోవటాన్ని ఒక హక్కులా చేశాం. నాడు – నేడు ద్వారా తొలి విడతలో 15,715 పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రూ.3,669 కోట్లు వ్యయం చేశాం. జగనన్న విద్యా కానుక ద్వారా 47 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.1,300 కోట్లు ఖర్చు చేశాం. ఫలితంగా ప్రైవేట్ స్కూళ్ల నుంచి లక్షల సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 36.89 లక్షల పిల్లలకు మేలు చేస్తూ మార్చిన మెనూ ద్వారా జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇందుకోసం ఏటా రూ.1,600 కోట్లు చిరునవ్వుతో ఖర్చు చేస్తున్నాం. సంపూర్ణ పోషణ పథకం ద్వారా 30.16 లక్షల మందికి మేలు చేస్తూ ఏటా రూ. 1,800 కోట్లు వ్యయం చేస్తున్నాం. జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తున్నాం. టీచర్ల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నాం. స్పెషలిస్ట్ టీచర్లతో బోధనకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ స్కూళ్లను సీబీఎస్ఈ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మారుస్తున్నాం. ఫీజుల నియంత్రణతోపాటు విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేస్తున్నాం. జగనన్న విద్యా దీవెన ద్వారా 100% ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ప్రతి 3 నెలలకోసారి ఎటువంటి బకాయిలు లేకుండా తల్లుల ఖాతాలకే సొమ్మును జమ చేస్తున్నాం. ఇందుకోసం ఇప్పటిదాకా రూ.5,573 కోట్లు ఖర్చు చేశాం. జగనన్న వసతి దీవెన ద్వారా 15.57 లక్షల మంది విద్యార్థులకు మేలు చేస్తూ ఇప్పటివరకు రూ.2270 కోట్లు ఖర్చు చేశాం. పిల్లల చదువుల కోసం ఈ పథకాలకే దాదాపుగా రూ.26,677 కోట్లు ఖర్చు చేశాం. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దిన వేడుకలు: పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం జగన్ 95 శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్నవారందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీని వర్తింపజేయటం ద్వారా 95 శాతం ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఖర్చు రూ.1,000 దాటితే ఉచితంగా వైద్యం అందించాలన్న తపనతో 2,434 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చాం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కోసం రూ. 3,900 కోట్లు వ్యయం చేశాం. ఆపరేషన్ తరవాత రోగి కోలుకునే సమయంలో నెలకు రూ.5 వేలు చొప్పున వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద ఇస్తున్నాం. 108, 104 సేవలకు అర్థం చెబుతూ ఏకంగా 1,068 వాహనాల్ని ప్రతి నియోజకవర్గానికీ పంపాం. పిల్లలు, పెద్దలందరికీ వర్తించేలా వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటవుతున్నాయి. కోవిడ్‌పై యుద్ధంలో ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తూ ఫోకస్డ్ టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ ద్వారా నియంత్రణ చర్యలు చేపట్టాం. కోవిడ్‌కు ఉచితంగా వైద్యం అందిస్తూ పేదలకు అండగా ఉన్నాం. రాష్ట్రంలో ఇప్పటివరకు 11 టీచింగ్ ఆసుపత్రులే ఉండగా కొత్తగా మరో 16 వైద్య బోధనాసుపత్రులను నిర్మిస్తున్నాం.జాతీయ ప్రమాణాలతో వైద్యాన్ని అందించేందుకు వైద్య రంగంలో నాడు–నేడు అమలు చేస్తున్నాం. వీటికి రూ.16,300 కోట్లు వ్యయం చేస్తున్నాం. కోవిడ్ వల్ల తల్లితండ్రి ఇద్దరినీ కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షలు చొప్పున డిపాజిట్ చేసి వారి ఆలనా పాలనా చూసుకునే ఏర్పాట్లు చేసిన తొలి ప్రభుత్వం కూడా దేశంలో మనదే. మనిషిని బతికించాలనే ప్రతి ఒక్క ప్రయత్నాన్నీ మనసు పెట్టి చేసే ప్రభుత్వం మనది. మన కళ్లెదుటే ఉద్యోగాలు.. ఉద్యోగాల విషయానికి వస్తే నిరుద్యోగులకు మేలు చేశాం. మన కళ్ల ఎదుటే దాదాపు 1.30 లక్షల మంది శాశ్వత ఉద్యోగులు గ్రామ, వార్డు సచివాలయాల్లో కనిపిస్తున్నారు. ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీలో 58 వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. 2.70 లక్షల మంది మన కళ్లెదుటే వలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. 95 వేల మందికిపైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ ద్వారా న్యాయం చేశాం. మరో 20 వేల మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలిచ్చాం. ఇలా దాదాపు 6.03 లక్షల మంది ఉద్యోగులు మన కళ్లెదుట కనిపిస్తున్నారు. ఇందులోను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 75 శాతానికి పైగా ఉద్యోగాలు లభించాయని సగర్వంగా చెబుతున్నా. స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రసంగిస్తున్న సీఎం ఆధునిక మహిళ ఆంధ్రప్రదేశ్ నుంచే.. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించాలన్న సంకల్పంతో కృషి చేస్తోంది. 44.50 లక్షల మంది తల్లులకు తమ పిల్లలను చదివించుకునేందుకు జగనన్న అమ్మ ఒడి ద్వారా రెండేళ్లలో రూ.13 వేల కోట్లు అందజేశాం. వైఎస్సార్ ఆసరా ద్వారా 87.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటివరకు రూ.6,500 కోట్లు లబ్ధి చేకూరింది. వైఎస్సార్ చేయూత ద్వారా 24.56 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు రూ.9,000 కోట్లు సాయం చేశాం. దీనికి తోడు బ్యాంకుల రుణ సదుపాయంతో పాటు ప్రముఖ కార్పొరేట్ సంస్థలతో అనుసంధానం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు చర్యలు తీసుకుంటున్నాం. వైఎస్సార్–జగనన్న కాలనీల ద్వారా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. గృహ నిర్మాణం ద్వారా దాదాపు 1.25 కోట్ల మందికి అంటే రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి లబ్ధి చేకూరుతోంది. తొలిదశలో 15.60 లక్షల గృహ నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇళ్ల ద్వారా 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో దాదాపుగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపద ఉంచుతున్నాం. వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.2,509 కోట్లు అందించాం. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా ఇప్పటివరకు 3.28 లక్షల మందికి రూ.982 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. పదవులు, పనుల్లో అక్కచెల్లెమ్మలకు 50 శాతం దేశ చరిత్రలోనే తొలిసారిగా నామినేటెడ్ పదవులు, నామినేషన్‌పై ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం కచ్చితంగా మహిళలకే దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తెచ్చింది. దీనివల్ల ఇవాళ నామినేటెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ల పదవులు, మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ల పదవుల్లో 50 శాతం మంది మహిళలే కనిపిస్తున్నారు. మహిళా రాజకీయ సాధికారతలో భాగంగా ఒక చెల్లిని హోంమంత్రిగా చేశాం. నెల క్రితం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో సగ భాగానికి మించి 58 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వడంతో పాటు సగం పదవులు మహిళలకు ఇచ్చామని సవినయంగా తెలియజేస్తున్నా. అక్కచెల్లెమ్మల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ దిశ బిల్లు, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, దిశ యాప్‌లకు రూపకల్పన చేసిన ప్రభుత్వం మనది. చేతల్లో సామాజిక న్యాయం.. రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన సోదర భావానికి(ఫ్రెటర్నిటీ) అర్థం చెబుతూ సామాజిక న్యాయాన్ని అమలు చేసి చూపాం. మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి 60 శాతం పదవులు ఇచ్చాం. ఐదు ఉప ముఖ్యమంత్రుల పదవుల్లో నాలుగు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన ప్రభుత్వం మనదే. అటు రాజ్యసభలోనూ, ఇటు కౌన్సిల్లోనూ సామాజిక న్యాయం విషయంలో మనం చేసినట్లుగా ఇంతకుముందు జరగలేదు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేయటంతోపాటు ఎస్సీ ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల దిశగా అడుగులు వేశాం. బీసీలకు ప్రత్యేకించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. మార్కెట్ యార్డుల ఛైర్మన్లు, దేవస్థానాల కమిటీల ఛైర్మన్లు, సభ్యులుగా ఈ రోజు పేద వర్గాలవారు సగభాగం కనిపిస్తున్నారని సగర్వంగా తెలియజేస్తున్నా. పెన్షన్లు పెంచాం.. వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ వాహన మిత్ర, జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా నిరుపేదలకు అండగా నిలుస్తున్నాం. అగ్రిగోల్డ్ బాధితులకు రెండో విడత డబ్బులను ఈ నెలలోనే అందించబోతున్నాం. 2019 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకు 39 లక్షల పెన్షన్లు మాత్రమే ఉంటే మన ప్రభుత్వంలో పెన్షన్ల సంఖ్యను 61 లక్షలకు పెంచి ఇస్తున్నాం. గత ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు రూ.వెయ్యి మాత్రమే ఇచ్చిన పెన్షన్ సొమ్మును రూ.2,250కి పెంచింది కూడా మన ప్రభుత్వమే. గత సర్కారు హయాంలో నెలకు రూ.500 కోట్లు మాత్రమే ఉన్న పెన్షన్ బిల్లు నేడు రూ.1,500 కోట్లకు చేరిందని మీ బిడ్డగా సవినయంగా తెలియచేస్తున్నా. ఉద్యోగులకు రాబోయే రోజుల్లో మరికొన్ని.. ఉద్యోగుల జీతాల విషయానికి వస్తే.. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వోద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చాం. కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చాం. అంగన్వాడీల్లో పని చేస్తున్నవారికి, ఆశా వర్కర్లకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, శానిటరీ వర్కర్లకు, హోంగార్డులకు, 104, 108 సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు ఇలా అనేక విభాగాల్లో చాలీ చాలని వేతనాలతో బతుకు బండి ఈడుస్తున్న 7,02,656 మందికి లబ్ధి చేకూరుస్తూ వేతనాలు పెంచాం. పోలీసులకు వీక్లీ ఆఫ్ కూడా తీసుకొచ్చాం. ఉద్యోగులకు చేయాల్సినవి మరికొన్ని ఉన్నాయన్నది నాకు తెలుసు. వారందరికీ న్యాయం చేసేలా రాబోయే రోజుల్లో మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. -
ఆగస్టు 15 వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం
సాక్షి, విజయవాడ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మున్సిపల్ స్టేడియంలో వేడుకల ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సిద్ధంగా ఉందన్నారు.కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేడుకల్లో పాల్గొని గౌరవ జెండావందనం చేయనున్నారు. పెరేడ్‌కు సంబంధించిన ఫైనల్ రిహార్సల్స్‌ని వీక్షించిన గౌతమ్ వారికి పలు సూచనలు చేశారు. రేపు పెరేడ్లో ఆరు బెటాలియన్లకు చెందిన ఆరు కంటింజెంట్లు పాల్గొంటుండగా.. వివిధ శాఖలకు చెందిన పది శకటాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి.ఆయన వెంట సీఎస్ నీలం సహానీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, సీఎం పోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు ఉన్నారు. -
గణతంత్ర వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ
సాక్షి,విజయవాడ : జనవరి 26ను పురస్కరించుకొని విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. జనవరి 26న గణతంత్ర వేడుకలను ప్రజలంతా గర్వపడేలా నిర్వహించబోతున్నామన్నారు. ఆరోజు ఉదయం 9గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయని, పరేడ్ వేడుకలలో ఈసారి తెలంగాణ పోలీసులు కూడా పాల్గొనబోతున్నారని డీజీపీ స్పష్టం చేశారు. ఈసారి వేడుకలలో దిశ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందని తెలిపారు. గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొననుండడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు పేర్కొన్నారు. -
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి : ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారిగా ఆగస్టు 15న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, వీవీఐపీలు, విద్యార్థులు పాల్గొనే ఈ వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. మరోవైపు.. పంద్రాగస్టు రోజున దేశంలో ఉగ్రవాదుల దాడులు చోటుచేసుకునే అవకాశముందని ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీజీపీ గౌతమ్ సవాంగ్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వేడుకలు జరుగుతున్న మున్సిపల్ స్టేడియంతోపాటు నగరంలోనూ భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ వంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే పరేడ్ కోసం గత వారం రోజులుగా మున్సిపల్ స్టేడియంలో రిహార్సల్స్ చేస్తున్నారు. అలాగే, శాఖల వారీగా ప్రభుత్వ పథకాలను వివరించే ప్రత్యేక శకటాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈసారి 13 శకటాలు ప్రదర్శించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, భారీ వర్షాలు కురిస్తే వేడుకలు జరిగే స్టేడియం జలమయం కాకుండా ఉండేందుకు యుద్ధప్రాతిపదికన అవసరమైన పనులు పూర్తిచేశారు. విజయవాడ నగర పోలీసులు, మున్సిపల్, ఆర్ అండ్ బీ తదితర శాఖల సమన్వయంతో ఏర్పాట్లు ముగింపు దశకు చేరుకున్నాయి. -
జగన్ చరిత్రలో నిలిచిపోవాలి: కేసీఆర్
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ కేసీఆర్ ప్రసంగించారు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని తెలుగు ప్రజల జీవన గమనంలో ఉజ్వల ఘట్టమని వర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ప్రేమాభిమానాలు, పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని బలంగా విశ్వసిస్తున్నానని అన్నారు. ఖడ్గచాలనం కాదు కరచాలనం కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన పక్షాన, తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు అంటూ ప్రసంగాన్ని కేసీఆర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. జగన్ వయసు చిన్నది, బాధ్యత పెద్దదని వ్యాఖ్యానించారు. ఈ బాధ్యతను అద్భుతంగా నిర్వహించగల అభినివేశం, శక్తి, సామర్థ్యం ఉందని గత 9 ఏళ్లుగా జగన్ నిరూపించారని అన్నారు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వంతో ముఖ్యమంత్రి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలరని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రభుత్వాలు చేయాల్సింది ఖడ్గచాలనం కాదు కరచాలనం అని పేర్కొన్నారు. ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయత, అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి గోదావరి జలాలను ఒడిసిపడదాం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో గోదావరి జలాల సంపూర్ణ వినియోగం వంద శాతం జరిగి తీరాలని కేసీఆర్ అన్నారు. కృష్ణా జలాలను సమస్యలను పరిష్కరించుకుని ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాలు సమర్థవంతంగా వినియోగించుకుంటూనే సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో ప్రతి అంగుళం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. దీనికి అవసరమైన అండదండలు, సహాయ సహకారాలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని హామీయిచ్చారు. ఏపీ ప్రజలు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తండ్రి పేరు నిలబెట్టాలని వైఎస్ జగన్‌కు సూచించారు. చరిత్రలో నిలిచిపోయేవిధంగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. మూడు, నాలుగు టర్మ్‌ల వరకు వైఎస్ జగన్ పాలన కొనసాగాలని కేసీఆర్ కోరుకున్నారు. సంబంధిత కథనాలు నవరత్నాలను అమలు చేస్తాం : సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ మీ నాన్న వారసత్వాన్ని కొనసాగించు: ఎమ్కే స్టాలిన్ వైఎస్ జగన్‌కు టీటీడీ వేద పండితుల ఆశీర్వాదం -
‘చంద్రబాబుపై కసి తీర్చుకున్నారు’
సాక్షి, విజయవాడ: వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రేమాభిమానాలతో పాటు చంద్రబాబుపై మహా కసితో తమ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓట్ల రూపంలో చంద్రబాబుపై కసినంతా ప్రజలు తీర్చుకున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ రాక్షస పాలనకు చరమగీతం పాలన్న ఉద్దేశంతో తమకు అఖండ విజయం అందించారని అన్నారు. వైఎస్ జగన్ గొప్ప పరిపాలన ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. వైఎస్సార్ కంటే జగన్ గొప్ప పరిపాలన అందిస్తారని అభిప్రాయపడ్డారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలని ప్రజలు కోరుకుని తమకు ఓటు వేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. పదేళ్లుగా తమ నాయకుడు వైఎస్ జగన్ పడిన కష్టానికి ప్రతిపఫలం దక్కిందని ఆయన పేర్కొన్నారు. జగన్‌లో ప్రజలు గొప్పనాయకుడిని చూశారు కాబట్టి అఖండ విజయం కట్టబెట్టారని అన్నారు. -
జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వర్మ
సాక్షి, విజయవాడ: తన జీవితంలో మొదటిసారి రాజకీయ కార్యక్రమానికి వచ్చానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహంతోనే వైఎస్సార్సీపీకి ప్రజలు కట్టం కట్టారని అన్నారు. వైఎస్ జగన్ చారిత్రాక విజయం సాధించారని ప్రశంసించారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి టీడీపీ ఓటమికి కారణమన్నారు. వైఎస్ జగన్ మాటల్లోని నిజాయితీ ప్రజలకు కనెక్ట్ అయిందన్నారు. ఆయనపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకుని అఖండ విజయంతో గెలిపించారని వివరించారు. వైఎస్ జగన్ మంచి పరిపాలన అందిస్తారన్న నమ్మకాన్ని రాంగోపాల్ వర్మ వ్యక్తం చేశారు. (చదవండి: అఖండ విజయం మిరాకిల్: అలీ) సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తెలంగాణ జట్టుకు రజతం
విజయవాడ స్పోర్ట్స్: జాతీయ జూనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు రికర్వ్ టీమ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. సర్వీసెస్ జట్టుకు స్వర్ణం, జార్ఖండ్ జట్టుకు కాంస్యం లభించాయి. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో ప్రణీత, ఆకుల రవళి, హేమలత, కవితలతో కూడిన తెలంగాణ జట్టు ‘టైబ్రేక్’లో 21-25 తేడాతో సర్వీసెస్ జట్టు చేతిలో ఓడింది. మినీ రికర్వ్ మిక్స్డ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో తెలంగాణ 2-6తో హర్యానా చేతిలో ఓడింది. జూనియర్ బాలుర వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఓల్గా అకాడమీ ఆర్చర్ రవి చంద్ర కాంస్య పతక పోరులో 1-7 తేడాతో తన్మయ్ (మహారాష్ట్ర) చేతిలో ఓడాడు.