
సాక్షి,విజయవాడ : జనవరి 26ను పురస్కరించుకొని విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. జనవరి 26న గణతంత్ర వేడుకలను ప్రజలంతా గర్వపడేలా నిర్వహించబోతున్నామన్నారు. ఆరోజు ఉదయం 9గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయని, పరేడ్ వేడుకలలో ఈసారి తెలంగాణ పోలీసులు కూడా పాల్గొనబోతున్నారని డీజీపీ స్పష్టం చేశారు. ఈసారి వేడుకలలో దిశ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందని తెలిపారు. గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొననుండడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment