
జైపూర్ : ప్రమాణ స్వీకారం కంటే ముందే మోదీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు నడిపిస్తోన్న ప్రభుత్వాలను కూలదోసేందుకు ప్రయత్నిస్తోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ఆరోపించారు. రెండో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి, అశోక్ గెహ్లోట్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. ‘నూతనంగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం ప్రమాణస్వీకారం కంటే ముందే ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసేందుకు ప్రయత్నిస్తోంది. పశ్చిమబెంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ఈ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి’ అంటూ అశోక్ గెహ్లోట్ ట్వీట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో రాజస్తాన్‌లో కాంగ్రెస్ 25 లోక్ సభ స్థానాల్లో కనీసం ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది.
Even before the swearing in ceremony of newly elected BJP government, they are trying to disturb and dismantle the state governments of the opposition parties including West Bengal, Karnatka and Madhya Pradesh.
— Ashok Gehlot (@ashokgehlot51) May 30, 2019
My best wishes from Jaipur.
అశోక్ గెహ్లోట్ స్వయంగా తన కుమారున్ని కూడా గెలిపించుకోలేకపోయాడు. ఈ క్రమంలో అశోక్ గెహ్లోట్ రాజీనామా చేయాలంటూ ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ డిమాండ్ చేస్తున్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో రాజస్తాన్‌లో కాంగ్రెస్ ఓటమి పాలయ్యింది. ముఖ్యమంత్రి స్వయంగా తన కుమారున్ని కూడా గెలిపించుకోలేకపోయారు. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. అశోక్ గెహ్లోట్ రాజీనామా చేయాలి’ అంటూ దినేష్ శర్మ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment