
ఇటానగర్ : అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమాఖండూ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బీడీ మిశ్రా ఆయనతో ప్రమాణస్వీకారం చేపించారు. 60 మంది సభ్యులున్న అరుణాచల్‌ప్రదేశ్ శాసనసభలో బీజేపీ 41 స్థానాలు గెలుపొందింది. దీంతో భారతీయ జనతాపార్టీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇటానగర్‌లోని దోర్జీ ఖండూ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అసోం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మేఘాలయ సీఎంలు హాజరయ్యారు.