
సర్పంచ్ ఇంటి వద్ద ప్రమాణస్వీకారం చేయిస్తున్న పంచాయతీ కార్యదర్శి
ఈపూరు(వినుకొండ): పంచాయతీ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని.. టీడీపీకి చెందిన ఓ సర్పంచ్ తన ఇంటి ముందే వేడుకలా జరిపించుకున్నారు. పంచాయతీ కార్యదర్శి దగ్గరుండి మరీ జరిపించారు. గుంటూరు జిల్లా చిట్టాపురంలో జరిగిన ఈ ఘటన విమర్శలపాలైంది. చిట్టాపురం సర్పంచ్‌గా నందిగం నిర్మలాదేవి ఎన్నికయ్యారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరగాల్సి ఉంది. అయితే ఇందుకు విరుద్ధంగా పంచాయతీ కార్యదర్శి దిలీప్.. నిర్మలాదేవి ఇంటి ముందే టెంట్లు వేసి ఘనంగా జరిపించారు. దీనిపై కార్యదర్శిని ప్రశ్నించగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయమై ఎంపీడీవో ప్రసాద్‌ను వివరణ కోరగా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment