ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీతో పాటు తెలంగాణలోనూ అభిమానులున్నారు. ఆయన వీరాభిమాని ఒకరు కూతురు పెళ్లిలో భారీ ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేసి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వీక్షించే అవకాశం కల్పించారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌లో ఈ విశేషం చోటుచేసుకుంది. వైఎస్ జగన్ వీరాభిమాని ఇంద్రారెడ్డి కూతురు వివాహం గురువారం జరిగింది. పెళ్లి వేడుకలో ఆయన ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేసి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు అవకాశం కల్పించారు. పెళ్లికి వచ్చిన బంధువులు.. ప్రమాణస్వీకార కార్యక్రమ ప్రత్యక్షప్రసారం చూసి ఆనందించారు. వధూవరులను ఆశీర్వదించారు.