ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి టీటీడీ వేద పండితులు ఆశీర్వాదం అందజేశారు. గురువారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి చేరుకున్న టీటీడీ ఈవో సింఘాల్, అర్చకులు వైఎస్ జగన్‌కు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే వైఎస్ జగన్ సర్వమత ప్రార్థనల్లో పాల్గొననున్నారు. మరికాసేపట్లో వైఎస్ జగన్ తన నివాసం నుంచి ప్రమాణ స్వీకారోత్సవం జరగనున్న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి బయలుదేరనున్నారు.