
హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ సీఎం ప్రమాణ స్వీకారం లైవ్
చింతలపాలెం (హుజూర్‌నగర్) : వైఎస్ కుటుంబంపై తనకున్న ప్రేమను వినూత్నంగా వ్యక్తం చేశాడు ఓ వీరాభిమాని. తన కూతురు పెళ్లిపందిరిలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయించి అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ ఘటన గురువారం హుజూర్‌నగర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. హుజూర్‌నగర్‌కు చెందిన బిల్లుపల్లి రమా ఇంద్రారెడ్డి తన కూతురు మంజుభార్గవి అల్లుడు ఫణీందర్‌రెడ్డిల వివాహం గురువారం జరుగుతోంది. ఇదే సమయానికి ఏపీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. ఈనేపథ్యంలో ఇంద్రారెడ్డి జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం లైవ్‌లో చూడాలనుకున్నాడు. వివాహం వల్ల కుదరక పోవడంతో మండపంలోనే సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం లైవ్ స్క్రీన్‌లను ఏర్పాటు చేయించాడు. దీంతో హాజరైన అతిథులు అందరూ పెళ్లితో పాటు జగన్ ప్రమాణ స్వీకారాన్ని తిలకించి ఆనందించారు. నూతన వధూవరులతో పాటు లైవ్ స్క్రీన్‌లు ఏర్పాటు చేసినందుకు ఇంద్రారెడ్డిని పలువురు ఆయనను అభినందించారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
పెళ్లిలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం