జగన్‌కు మోదీ, రాహుల్‌ శుభాకాంక్షలు | Narendra Modi And Rahul Gandhi Congratulates YS Jagan Mohan Reddy Sworn As AP CM | Sakshi
Sakshi News home page

ఆంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధికి సహకరిస్తాం: మోదీ

Published Thu, May 30 2019 2:54 PM | Last Updated on Thu, May 30 2019 4:38 PM

Narendra Modi And Rahul Gandhi Congratulates YS Jagan Mohan Reddy Sworn As AP CM - Sakshi

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి.. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

పూర్తి సహకారం అందిస్తాం : మోదీ
‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి శుభాకాంక్షలు. కేంద్రం నుంచి మీకు పూర్తి సహకారం అందిస్తానని మాట ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం మనం కలిసి పని చేద్దాం’ అంటూ మోదీ ట్వీట్‌ చేశారు.

‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌ మోహన్‌ రెడ్డి గారికి, ఆయన టీమ్‌కు నా అభినందనలు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌ను జగన్‌ సరికొత్త శిఖరాలకు చేర్చగలరని రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆశిస్తున్నారంటూ రాష్ట్రపతి భవన్‌ ట్వీట్‌ చేసింది. రామ్‌ నాథ్‌ కోవింద్‌ జగన్‌కు ఫోన్‌ చేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

న‌వ్యాంధ్ర‌ప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో గురువారం మధ్యాహ్నం 12.23 గంటలకు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా జగన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement