సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ పర్యటన రద్దైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్ హాజరు కాలేకపోతున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో మధ్యాహ్నం మూడున్నర తర్వాత ప్రత్యేక విమానాల ల్యాండింగ్‌కు విమానాయాన శాఖ అనుమతి నిరాకరించింది. దీంతో ముఖ్యమంత్రుల పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది.
కాగా కేసీఆర్ టూర్ షెడ్యూల్‌కు సంబంధించి సీఎంవో విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆయన నేరుగా విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. రాత్రి 7 గంటలకు జరిగే మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారని అంతా భావించారు. కానీ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యేక విమానాలకు మధ్యాహ్నం మూడున్నర గంటల వరకే అనుమతిచ్చారు. దీంతో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరాల్సిన ప్రత్యేక విమానం రద్దయింది. ఇక, కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దుచేసుకుని నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ బయల్దేరారు.
Comments
Please login to add a commentAdd a comment