కిక్కిరిసిన ఇందిరాగాంధీ స్టేడియం | Huge Crowd at Indira Gandhi Stadium | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన ఇందిరాగాంధీ స్టేడియం

Published Thu, May 30 2019 10:48 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ విజయవాడలో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే వేలాది మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగే ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి వీలైనంత త్వరగా వెళ్లాలని అభిమానులు భావించడంతో ఉదయం నుంచే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కిటకిటలాడుతోంది. స్టేడియం మొత్తం జగన్‌ నినాదాలతో మారుమోగుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమకు కేటాయించిన గ్యాలరీల్లోకి చేరుకుంటున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావులతో పాటు పలు రాజకీయ పార్టీల ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement