రిలేదీక్షలో ఎమ్మార్పీఎస్ నాయకులు
-
ఆరో రోజుకు ఎమ్మార్పీఎస్ దీక్షలు
ముకరంపుర : కేంద్రం ఇచ్చిన హామీమేరకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి బొడ్డు రాములు డిమాండ్ చేశారు. వర్గీకరణ కోసం సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి ఆరో రోజుకు చేరాయి. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగల్లోని 59 ఉపకులాలకు సమన్యాయం జరుగుతుందని, సీఎం కేసీఆర్ అఖిలపక్ష కమిటీని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరారు. దీక్షలో సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండ్ర శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాదాసు థామస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మ్యాకల లక్ష్మణ్, జిల్లా నాయకులు వడ్లూరి శ్రీనివాస్, జిల్లా యువసేన అధ్యక్షుడు సుంకె సంపత్, కరీంనగర్ మండల అధ్యక్షుడు ఆరపెల్లి వెంకటేశ్, నాయకులు ద్యావ అంజన్న, సిరిసిల్ల నర్సన్న ఉన్నారు.