వర్గీకరణ సాధించే వరకు పోరాటం | do the sc divide | Sakshi
Sakshi News home page

వర్గీకరణ సాధించే వరకు పోరాటం

Published Tue, Aug 9 2016 6:11 PM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

do the sc divide

కాల్వశ్రీరాంపూర్‌: ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు ఎమ్మార్పీఎస్‌ పోరాటం చేస్తుందని పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి బర్ల తిరుపతి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఎమ్మార్పీఎస్‌ నాయకులు ర్యాలీ నిర్వహించారు. వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని తిరుపతి డిమాండ్‌ చేశారు. జస్టిస్‌ రాంచందర్‌ రావు, ఉషామెహ్రా కమిషన్లు వర్గీకరణ అనుకూలంగా నివేదికలు సమర్పించినా ప్రభుత్వాలు స్పందించకపోవడం వర్గీకరణపై వారి చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోందన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు పాల శంకర్, మల్లేశం, రామస్వామి, రాజయ్య, రాజేశం, రమేశ్, స్వామి, కృష్ణ, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement