
సియోల్: కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ విజయవంతంగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించి దక్షిణ కొరియా చరిత్ర సృష్టించింది. పోలింగ్ సమయంలో కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 14 వేల పోలింగ్ బూత్‌లను క్రిమిరహితం చేశారు. ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద పరస్పరం 3 అడుగుల దూరం పాటించారు. బూత్‌లోకి వెళ్లేమందే ఓటర్ల టెంపరేచర్‌లను పరీక్షించి, జ్వరం ఉన్నవారిని లోపలికి అనుమతించలేదు. బూత్‌లోకి వెళ్లాక చేతులను శానిటైజ్ చేసుకుని, అధికారులు ఇచ్చిన గ్లవ్స్ వేసుకుని ఓటేశారు. నిజానికి 300 మంది సభ్యుల నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు బుధవారం జరగాల్సి ఉంది. అయితే, అక్కడ ముందుగానే ఓటేసే అవకాశం ఉంది. దాంతో శుక్ర, శనివారాల్లోనే పోలింగ్ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment