సియోల్ : దక్షిణ కొరియాలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో సారి మొదలైనట్లుగా కలిపిస్తోంది. తాజాగా అక్కడ కొత్తగా 34 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్ 9 తర్వాత ఆదివారమే అత్యధికమైన కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత కొన్నిరోజులుగా కేసులు నమోదు కాకపోవడం, మరణాలు లేకపోవడంతో బార్లు, క్లబ్బులకు అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ కరోనా కేసులు క్రమక్రమంగా పెరగడం మొదలైంది. ఇటీవల నైట్‌క్లబ్‌కు ఒక కరోనా రోగి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అతడి నుంచే 24 మందికి కరోనా సోకినట్టు అధికారులు తెలుసుకున్నారు. ఈ విధంగా అతడి ఒక్కడి నుంచి మొత్తంగా 54 మంది కరోనా బారిన పడ్డారని అధికారులు తెలిపారు. అదే నైట్ క్లబ్‌కు వెళ్లిన 1900 మందిని అధికారులు వెతుకుతున్నారు. నైట్ క్లబ్‌కు వెళ్లిన ప్రతిఒక్కరు 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. అలాగే అధికారులు నైట్ క్లబ్‌లను తాత్కాలికంగా మూసివేశారు.
(చదవండి : 2లక్షలు దాటిన కరోనా కేసులు)
మరోపక్క దక్షిణ కొరియాలో రెండో వేవ్ మొదలవుతోందంటూ అధికారులు ప్రజలను హెచ్చరించారు. దీనిపై అధ్యక్షుడు మూన్ జే ఇన్ మాట్లాడుతూ.. కరోనా అంతమయ్యేంత వరకు కేసులు కూడా అంతం కావని అన్నారు. ప్రజలు కరోనా అంతమయ్యేంత వరకు భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు. (చదవండి : ట్రంప్‌పై విమర్శలు: ఒబామా ఆడియో లీక్)
ప్రపంచదేశాలతో పోల్చుకుంటే కరోనా మహమ్మారిని దక్షిణ కొరియా చాకచక్యంగా నియంత్రించగలిగింది. ఏప్రిల్ మొదటి వారంలోనే దక్షిణ కొరియాలో కేసులు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఆంక్షలను కూడా ఎత్తివేసింది. దేశంలో ఆంక్షలను ఎత్తివేయడం.. స్కూళ్లు, వ్యాపారాలు నడుస్తుండటంతో కరోనా తిరిగి వ్యాప్తి చెందుతోందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై అధ్యక్షుడు మూన్ జే ఇన్ మాట్లాడుతూ.. కరోనా అంతమయ్యేంత వరకు కేసులు కూడా అంతం కావని చెప్పారు. ప్రజలు కరోనా అంతమయ్యేంత వరకు భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అంటువ్యాధి నివారణకు సంబంధించి మన రక్షణను మనం ఎప్పుడూ తగ్గించుకోకూడదన్నారు. దీర్ఘకాలిక పోరాటంలో భాగంగా కొరియా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (కేసీడీసీ) మరిన్ని అధికారాలు కట్టబెట్టారు. అలాగే దానిని డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ గా పేరు మార్చాలని సూచించారు. కాగా, దక్షిణ కొరియా వ్యాప్తంగా ఇప్పటి వరకు 10,874 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 256 మంది మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment